తెలంగాణకు కాబోయే సీఎం నేనే.. షర్మిల మాటల వెనక?
ఉన్నమాట: తెలంగాణకు కాబోయే సీఎం తానే అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ధీమాగా చెప్పు కుంటున్నారు. అయితే ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఏపీలో పవన్ కళ్యాణ్ లెక్క రెండు చోట్లా ఓడినట్టు షర్మిల తాను పోటీ చేసే స్థానంలో అయినా గెలుస్తుందా అన్నది అనుమానమే. అయితే ఎలాగూ ఆమె బీజేపీ వదిలిన బాణం అంటున్నారు కాబట్టి ఆమెను గెలిపించే బాధ్యత కూడా ఆ పార్టీ తీసుకుంటుందేమో అన్నది […]

ఉన్నమాట: తెలంగాణకు కాబోయే సీఎం తానే అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ధీమాగా చెప్పు కుంటున్నారు. అయితే ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఏపీలో పవన్ కళ్యాణ్ లెక్క రెండు చోట్లా ఓడినట్టు షర్మిల తాను పోటీ చేసే స్థానంలో అయినా గెలుస్తుందా అన్నది అనుమానమే. అయితే ఎలాగూ ఆమె బీజేపీ వదిలిన బాణం అంటున్నారు కాబట్టి ఆమెను గెలిపించే బాధ్యత కూడా ఆ పార్టీ తీసుకుంటుందేమో అన్నది రాబోయే రోజుల్లో స్పష్టత వస్తుంది.
అలాగే రాష్ట్రంలో తాము ప్రధాన ప్రతిపక్షం స్థాయికి ఎదిగామని నిన్న మొన్న ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పుకున్నారు. కానీ కాంగ్రెస్‌దే ఆ స్థానం అని తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లి సర్వే చేసినా ఇదే తేలుతుంది. అంతేకాదు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను కాదని ప్రజలు మరో పార్టీని ఎంచుకుంటే ఆది కాంగ్రెస్ పార్టీని మాత్రమే. ఆ పార్టీకి కార్యకర్తల, నేతల బలం ఉన్నది.
కానీ బీజేపీకి ఇవేవీ లేవు. కాంగ్రెస్ నుంచో టీఆర్‌ఎస్ నుంచో అభ్యర్థులను తెచ్చుకుంటే తప్పా రాష్ట్రం మొత్తం పోటీ చేసే అవకాశమే లేదు. అందుకే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను గద్దె దించమే తమ లక్ష్యమని బీజేపీ భావిస్తున్నది. అందుకే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారం జరుగుతున్నట్టు.. ఇక్కడ కూడా వైఎస్ఆర్ టీపీ, బీజేపీ, కుదిరితే తెలంగాణ జన సమితి కలిసి పోటీ చేయవచ్చు.
బహుశా ఆ నమ్మకంతోనే అనుకుంటా షర్మిల తెలంగాణకు కాబోయే సీఎం తానే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే కాషాయ పార్టీ ఈ ఎనిమిదిన్నర ఏళ్ల కాలంలో 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది. వారి కుట్రలకు సహకరించిన వారిని సీఎం సీటులో కూర్చోబెట్టింది. అలాగే పార్టీలో వారికి కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత అస్సాం ముఖ్య మంత్రి హిమంత బిస్వశర్మ 2015 వరకు ఏ పార్టీలో ఉన్నారు.
అలాగే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియా ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో చూడొచ్చునని అంటున్నారు. ఇలాంటి ప్రయోగాలు బీజేపీ చేస్తూనే ఉన్నది. ఆ పార్టీ వదిలిన బాణాల్లో షర్మిల ఒకరు. ఆ మేరకు వారి మధ్య ఏమైనా అవగాహన ఉన్నదో లేదో ఇప్పటికైతే క్లారిటీ లేదు.
కానీ షర్మిల పాదయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణపై గవర్నర్ స్పందన చూస్తే వాళ్ళది రాజకీయ బంధమే అని అంటున్నారు. కాకపోతే ఎన్నికలకు ఇంకో ఏడాది ఉన్నది. కానీ షర్మిల తన మనసులో మాటను ముందే బయట పెట్టారని చర్చించుకుంటున్నారు. ఇది ఎలా ఉన్నది అంటే పిల్ల పుట్టక ముందే ఖుల్ల కుట్టిచ్చినట్టు ఉన్నది అని సామెత గుర్తు చేస్తున్నారు.