Vande Bharat Express | వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో చెల‌రేగిన మంట‌లు

Vande Bharat Express | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రైలు ప్ర‌మాదం జ‌రిగింది. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో సోమ‌వారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి. రాణి క‌మ‌లాప‌తి స్టేష‌న్ నుంచి ఢిల్లీకి రైలు బ‌య‌ల్దేరింది. కుర్వాయి కిథోరా స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకోగానే వందే భార‌త్‌లోని బ్యాట‌రీ బాక్సు నుంచి అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికులు రైలు నుంచి కింద‌కు దిగారు. అప్ర‌మ‌త్త‌మైన రైల్వే అధికారులు, ఇత‌రులు మంట‌ల‌ను ఆర్పేశారు. వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ […]

Vande Bharat Express | వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో చెల‌రేగిన మంట‌లు

Vande Bharat Express |

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రైలు ప్ర‌మాదం జ‌రిగింది. భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లో సోమ‌వారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి. రాణి క‌మ‌లాప‌తి స్టేష‌న్ నుంచి ఢిల్లీకి రైలు బ‌య‌ల్దేరింది.

కుర్వాయి కిథోరా స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకోగానే వందే భార‌త్‌లోని బ్యాట‌రీ బాక్సు నుంచి అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌యాణికులు రైలు నుంచి కింద‌కు దిగారు. అప్ర‌మ‌త్త‌మైన రైల్వే అధికారులు, ఇత‌రులు మంట‌ల‌ను ఆర్పేశారు.

వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ కోచ్ బ్యాట‌రీ బాక్సులో మంట‌లు చెల‌రేగ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు. మంట‌ల‌ను పూర్తిగా అదుపు చేశామ‌న్నారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌లేద‌న్నారు.

రాణి క‌మ‌లాప‌తి స్టేష‌న్ నుంచి ఢిల్లీలోని హ‌జ్ర‌త్ నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్ వ‌ర‌కు న‌డిచే వందే భార‌త్ ఎక్స్‌ప్రెస్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. శ‌నివారం త‌ప్ప అన్ని రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది.