Tejaswi-Akhil | అఖిల్, తేజస్వి సీక్రెట్ లవ్.. సోషల్ మీడియాలో రచ్చో రచ్చ!

Tejaswi-Akhil విధాత‌: బిగ్ బాస్‌కు వెళ్ళి వచ్చారంటే చాలు, వాళ్ళ గురించి పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం ఉండదు. వాళ్ళ క్యారెక్టర్ గురించి ఏదీ దాచకుండా బయట పెట్టేస్తుంది బిగ్ బాస్ షో. అలా తన కోప తాపాల గురించి, గుణ గణాల గురించి మొత్తం బయటేసుకుని కాస్త నెగిటివ్ నెస్‌ని మూట గట్టుకొచ్చిన వారిలో తేజస్వి మదివాడ ఒకరు. బిగ్ బాస్ హౌస్‍కి సీజన్ 2కి వెళ్ళి తన దురుసుతనంతో నలుగురి నోళ్ళల్లోనూ నానిన తేజస్వి మదివాడను […]

Tejaswi-Akhil | అఖిల్, తేజస్వి సీక్రెట్ లవ్.. సోషల్ మీడియాలో రచ్చో రచ్చ!

Tejaswi-Akhil

విధాత‌: బిగ్ బాస్‌కు వెళ్ళి వచ్చారంటే చాలు, వాళ్ళ గురించి పెద్దగా తెలుసుకోవాల్సింది ఏం ఉండదు. వాళ్ళ క్యారెక్టర్ గురించి ఏదీ దాచకుండా బయట పెట్టేస్తుంది బిగ్ బాస్ షో. అలా తన కోప తాపాల గురించి, గుణ గణాల గురించి మొత్తం బయటేసుకుని కాస్త నెగిటివ్ నెస్‌ని మూట గట్టుకొచ్చిన వారిలో తేజస్వి మదివాడ ఒకరు.

బిగ్ బాస్ హౌస్‍కి సీజన్ 2కి వెళ్ళి తన దురుసుతనంతో నలుగురి నోళ్ళల్లోనూ నానిన తేజస్వి మదివాడను అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. ఆమె నటించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లకన్నా బిగ్ బాస్‌కి వెళ్ళి వచ్చాకనే ఎక్కువ పాపులర్ అయింది.

ఇక అదే బిగ్ బాస్‌కి వెళ్ళిన అఖిల్ సార్థక్‌తో సన్నిహితంగా ఉండటం, తేజస్వి పుట్టినరోజుని అఖిల్ దగ్గరుండి చేయడం వెనుక చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె బర్త్‌డే‌ని ఇద్దరూ సీక్రెట్ ఫ్లేస్‌కి వెళ్ళి మరీ సెలబ్రేట్ చేసుకున్నట్లుగా వారిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారికి ఇట్టే తెలిసిపోతుంది. అయితే రెడ్ ట్రెండీ వేర్లో అందంగా ఉన్న తేజస్వి ని అఖిల్ సార్థక్ స్వయంగా కెమెరాలో బంధించాడు. దీనికి తేజస్వి అతనికి థ్యాంక్స్ కూడా చెప్పింది.

కాకపోతే.. వీరిద్దరి మధ్య సీరియస్ లవ్ స్టోరీనే నడుస్తుందనే టాక్ ఉన్నా.. ఆ విషయాన్ని ఇద్దరూ బయట పెట్టింది లేదు. ఈ బర్త్‌డే ఫోటోల పుణ్యమా అని సోషల్ మీడియాలో వీళ్ళ ఇద్దరి మధ్య ఉన్న సీక్రెట్ లవ్ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్, విసురుకున్న ఛాలెంజ్‌లతో సోషల్ మీడియా అంతా మోత మోగిపోతుంది.

అఖిల్ సార్థక్, తేజస్వి జంటగా పెర్ఫామ్ చేసిన బీబీ జోడి ప్రోగ్రామ్ తర్వాత వీరి మధ్య పరిచయం బాగా పెరిగింది. పార్టీలు, షికార్లంటూ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. అయితే అమ్మాయి వెనకపడటం అఖిల్‌కి ఇదే తొలిసారి అయితే కాదు. అఖిల్ ఇది వరకే ప్రేమలో పడ్డాడు. అతగాడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే మోనాల్‌తో కాస్త క్లోజ్‌గా ఉండి, కెమెరాల ముందు ఆమెతో రొమాన్స్ చేశాడు.