చెవిరెడ్డికి పెద్ద బాధ్యతలు.. అనుబంధ సంఘాలన్నీ ఇక ఆయ‌నవే!

విధాత‌: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న వైఎస్సార్సీపీ జిల్లా, రీజినల్ ఇన్‌చార్టీల నియామకాల్లో పార్టీ అనుబంధ సంఘాలన్నింటికి బాధ్యునిగా భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. అంటే విద్యార్థి, మ‌హిళా, యువత, చేనేత, కార్మిక, ఉపాధ్యాయ ఇలా దాదాపు 23 సంఘాలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాధ్యునిగా నియమించారు. ఇదే తరుణంలో ఆయన్ను చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఈ పరిణామాలు చూస్తుంటే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ […]

  • By: krs    latest    Nov 24, 2022 1:40 PM IST
చెవిరెడ్డికి పెద్ద బాధ్యతలు.. అనుబంధ సంఘాలన్నీ ఇక ఆయ‌నవే!

విధాత‌: చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న వైఎస్సార్సీపీ జిల్లా, రీజినల్ ఇన్‌చార్టీల నియామకాల్లో పార్టీ అనుబంధ సంఘాలన్నింటికి బాధ్యునిగా భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. అంటే విద్యార్థి, మ‌హిళా, యువత, చేనేత, కార్మిక, ఉపాధ్యాయ ఇలా దాదాపు 23 సంఘాలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాధ్యునిగా నియమించారు.

ఇదే తరుణంలో ఆయన్ను చిత్తూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. ఈ పరిణామాలు చూస్తుంటే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి రాజకీయ అరంగేట్రం కోసం తండ్రి భాస్కర్ రెడ్డి బాటలు వేస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వచ్చిన భాస్కర్ రెడ్డి జడ్పీటీసీ, తుడా చైర్మన్ స్థాయి నుంచి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి ఎదిగారు.

ఇప్పటికే పెద్ద కుమారుడు మోహిత్ రెడ్డి గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి వ్యక్తిని కలుస్తున్నారు. ప్రజల్లో తనకు ఓ ప్రత్యేక ఇమేజీని సంపాదించుకున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేయాలని మోహిత్ భావిస్తున్నారని స‌మాచారం.

ఈ నేపథ్యంలోనే ఆయనకు దారి క్లియర్ చేసేందుకు భాస్కర్ రెడ్డి తప్పుకుంటున్నారని అంటున్నారు. ఇప్పుడు ఆయన అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తారని అంటున్నారు. గతంలో ఈ అనుబంధ సంఘాలన్నీ విజయసాయిరెడ్డి చూసేవారు.