త్వరలో మూడు రాజధానుల బిల్లు: సజ్జల
విధాత: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై ప్రభుత్వ వైఖరి మేరకే సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నామన్నారు. గతంలో మూడు రాజధానులపై తీసుకొచ్చిన బిల్లులను వెనక్కి తీసుకున్నాం. లేని చట్టంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు. గతంలో చెప్పినట్టే 3 రాజధానులకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మరోసారి సజ్జల స్పష్టం చేశారు. […]

విధాత: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై ప్రభుత్వ వైఖరి మేరకే సుప్రీంకోర్టు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నామన్నారు.
గతంలో మూడు రాజధానులపై తీసుకొచ్చిన బిల్లులను వెనక్కి తీసుకున్నాం. లేని చట్టంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని అన్నారు. గతంలో చెప్పినట్టే 3 రాజధానులకు వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మరోసారి సజ్జల స్పష్టం చేశారు. ఈ రోజుకు కూడా రాష్ట్ర రాజధాని అమరావతే. అయితే త్వరలోనే న్యాయ ప్రక్రియకు లోబడి మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని సజ్జల అన్నారు.