BJP
విధాత: నిన్నంతా ఆగమాగం ఐన బిజెపి రాష్ట్ర అధ్యక్షుల నియామకానికి సంబంధించి కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారు. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు తీసుకొచ్చారు. అనేదానికి ఎవరి వెర్షన్ వాళ్ళు చెబుతున్నారు. తెలంగాణలో రెడ్డిల ప్రాబల్యం ఉన్న చోట్ల కిషన్ రెడ్డి అయితే కొంత పాజిటివ్ వేవ్ ఉంటుందన్న భావనలో కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు అని అంటున్నారు.
ఇక ఆంధ్రాలో కాపు అయినా సోము వీర్రాజును తప్పించి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టారు. ఈమె నియామకం వెనుక తెలంగాణలో పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని పార్టీ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి తెలంగాణాలో స్థిరపడిన సీమాంధ్ర ప్రజల్లో ఎక్కువమంది కమ్మ వాళ్ళున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, చిన్న పరిశ్రమలు ఇలా చాలా చోట్ల ప్రజలను. ఓట్లను.. జనాన్ని ప్రభావితం చేయదగిన సంఖ్యలో కమ్మ ప్రజలు ఉన్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరిని బిజెపి తరఫున తెలంగాణలో కూడా ప్రచారానికి తిప్పితే ఆ కమ్మ ఓట్లు, వారి ప్రభావిత ఓట్లు వస్తాయి అనే ఆశతో పార్టీ ఆమెకు ఈ బాధ్యత అప్పగించినట్లు తెలుస్తోంది.
పురంధేశ్వరి అటు తెలంగాణతో బాటు తెలంగాణాలో సైతం తమ పార్టీకి ఉపయోగపడతారని ప్లాన్ వేసి ఆమెను రంగంలోకి దించినట్లు చెబుతున్నారు . ఇక ఆంధ్రాలో సైతం అటు వైసిపి, టిడిపికి దూరంగా ఉంటూ వస్తున్నా జాతీయావాదులు.. ఉన్నతవర్గాలు ఇప్పుడు పురంధేశ్వరి సారధ్యంలో పార్టీలో పని చేసేందుకు వస్తారని పార్టీ ఆశిస్తోంది.