బీజేపీ బీ టీం BRS: మల్లు రవి

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మాజీ ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. బీఆర్ఎస్ బీజేపీ బీ టీంగా మారిందని, గత ఎనిమిది ఏండ్లుగా రెండు పార్టీలపై కాంగ్రెస్ పోరాటం చేస్తున్నదని అన్నారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ విధానాలను దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, లౌకిక వాదానికి తమ పార్టీ పెద్దపీట వేస్తున్నదని మాజీ ఎంపీ మల్లు రవి తెలిపారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు […]

  • By: krs    latest    Jan 08, 2023 2:45 PM IST
బీజేపీ బీ టీం BRS: మల్లు రవి

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని మాజీ ఎంపీ మల్లు రవి హెచ్చరించారు. బీఆర్ఎస్ బీజేపీ బీ టీంగా మారిందని, గత ఎనిమిది ఏండ్లుగా రెండు పార్టీలపై కాంగ్రెస్ పోరాటం చేస్తున్నదని అన్నారు.

దేశంలో బీజేపీ అనుసరిస్తున్న హిందుత్వ విధానాలను దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, లౌకిక వాదానికి తమ పార్టీ పెద్దపీట వేస్తున్నదని మాజీ ఎంపీ మల్లు రవి తెలిపారు. పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు పలుకుతూ, రాష్ట్రంలో ప్రత్యర్థులుగా డ్రామాలాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు బీఆర్ఎస్ జైకొట్టి కాంగ్రెస్ పై తమపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.