BJP | బండిని మారుస్తారా? ఈటలకు సర్ది చెబుతారా?
విధాత: బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ రెండు వర్గాలు చీలిపోయింది. చాలాకాలంగా ఈ వివాదం కొనసాగుతున్నది. ఈ ఇద్దరి నేతలను హస్తికను పిలిపించి కలిసి పనిచేయాలని అమిత్ షా, జేపీ నడ్డా సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోగా.. ఇంకా తీవ్రమైంది. బీజేపీలో కొత్త వారు చేరక పోగా ఈటల రాజేందర్‌నే పార్టీ మారాలని కొందరు నేతలు కౌన్సిలింగ్ ఇచ్చే దాకా వచ్చింది. బండి సంజయ్‌ను మార్చి […]

విధాత: బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ రెండు వర్గాలు చీలిపోయింది. చాలాకాలంగా ఈ వివాదం కొనసాగుతున్నది. ఈ ఇద్దరి నేతలను హస్తికను పిలిపించి కలిసి పనిచేయాలని అమిత్ షా, జేపీ నడ్డా సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోగా.. ఇంకా తీవ్రమైంది.
బీజేపీలో కొత్త వారు చేరక పోగా ఈటల రాజేందర్‌నే పార్టీ మారాలని కొందరు నేతలు కౌన్సిలింగ్ ఇచ్చే దాకా వచ్చింది. బండి సంజయ్‌ను మార్చి ఇతరులకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తప్పా ప్రయోజనం ఉండదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీంతో ఈటల, డీకే అరుణ పాటు మరో ఇద్దరు నేతల పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అధిష్ఠానం పిలుపు మేరకు ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారు. ఎన్నిలకు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉండటం, నేతల మధ్య గ్రూపు తగాదాలు తారాస్థాయికి చేరడం వంటి పార్టీకి నష్టం చేస్తాయని అధిష్ఠాన పెద్దలు భావిస్తున్నారు.
పార్టీకి చేటు చేసే ఏ చర్యలను ఉపేక్షించమని, ఎంతటివారైనా క్షమించమని హెచ్చరించారు. అయితే ఈ వివాదమంతా ఇద్దరు కీలక నేతల చుట్టే తిరుగుతుండటం పార్టీ నేతలను, శ్రేణులను అయోమయంలోకి నెట్టింది.
ఇప్పటికిప్పుడు బండి సంజయ్‌ని తప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అట్లని కొనసాగించినా కొత్త వారి చేరికలు కష్టమనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతున్నది. విడవమంటే పాముకు, కరవమంటే కప్పకు కోపం అన్న విధంగా ఈ ఇద్దరు నేతల తీరు ఉన్నదంటున్నారు.
పాత, కొత్త నేతల మధ్య విభేదాలకు తోడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు టికెట్లు ఆశించవద్దని గతంలోనే చెప్పడం కూడా పార్టీలోని చాలామంది నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది. ఈ పరిణామాలన్నీ కమలం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. బండి, ఈటల వర్గాల విభేదాలను అధిష్ఠానం పరిష్కరించకపోతే మరికొంతమంది పార్టీ వీడొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపితే కషాయ నేతల్లో నైరాష్యాన్ని నింపిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను అధిష్ఠానం పెద్దలు ఢిల్లీకి పిలవడం, ఈ భేటీలో ఏం చర్చిస్తారు? సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నది.