కేఏ పాల్‌కు కేంద్రం వెన్నుపోటు.. ఓటమి భయంతో బీజేపీ దెబ్బేసిందా!

సోషల్ మీడియాలో సెటైర్ల వెల్లువ! ఉన్న‌మాట: రానున్న రోజుల్లో బీజేపీకి పోటీ అవుతాడని భయంతో కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి మీద కేంద్రం దెబ్బ కొట్టిందా.. పాల్ పార్టీ బరిలో ఉంటే తమకు కష్టమేనన్న రహస్య నివేధికలతోనే కేంద్రం ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చి ఇలా స్ట్రోక్ ఇచ్చిందా.. ఎవరికీ సాధ్యం కాని మోడీ ఏపాయింట్మెంట్ పాల్‌కు దొరుకుతుంది. అమిత్ షా కూడా పిలిచిమరీ కబుర్లు చెబుతాడు కానీ చివర్లో ఇలా చేస్తారా.. ఇదీ నిన్నటి […]

కేఏ పాల్‌కు కేంద్రం వెన్నుపోటు.. ఓటమి భయంతో బీజేపీ దెబ్బేసిందా!
  • సోషల్ మీడియాలో సెటైర్ల వెల్లువ!

ఉన్న‌మాట: రానున్న రోజుల్లో బీజేపీకి పోటీ అవుతాడని భయంతో కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి మీద కేంద్రం దెబ్బ కొట్టిందా.. పాల్ పార్టీ బరిలో ఉంటే తమకు కష్టమేనన్న రహస్య నివేధికలతోనే కేంద్రం ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తెచ్చి ఇలా స్ట్రోక్ ఇచ్చిందా.. ఎవరికీ సాధ్యం కాని మోడీ ఏపాయింట్మెంట్ పాల్‌కు దొరుకుతుంది.

అమిత్ షా కూడా పిలిచిమరీ కబుర్లు చెబుతాడు కానీ చివర్లో ఇలా చేస్తారా.. ఇదీ నిన్నటి సోషల్ మీడియా లో వెల్లువెత్తిన సెటైర్లు. కొన్నేళ్లుగా ఎలాంటి ఉనికీ చూపని కొన్ని రాజకీయ పార్టీలను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది..

అందులో కేఎపాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. దీంతో పాల్ మీద నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు. పాల్ భలే గమ్మత్తుగా మాట్లాడుతుంటారు. తెలిసి అంటారో తెలీక అంటారో గానీ
కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రిని తానేనని జగన్ తన పార్టీలో చేరితే ప్రధానిని చేస్తానని పవన్ కల్యాణ్ తన పార్టీలో చేరితే ఏపీ ముఖ్యమంత్రిని చేస్తానని కేఏ పాల్ తరచూ చెబుతూ ఉంటారనే విషయం తెలిసిందే.

అయినా కేఏ పాల్ తనపై వచ్చే మీమ్స్.. సెటైర్లను పెద్దగా పట్టించుకోరు. యథాలాపంగా తాను చెప్పాలనుకున్నది చెప్పే తీరతారు. దేశంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా హైదరాబాద్లో అక్టోబర్ 2న జింఖాన గ్రౌండులో ప్రపంచ శాంతి సమావేశాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సభలకు ఏకంగా 28 దేశాల ప్రధానమంత్రులు వస్తున్నారని వెల్లడించారు.

అలాంటి కేఏ పాల్కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. క్రియాశీలకంగా లేని 537 పార్టీలను ఎన్నికల సంఘం నుంచి జాబితా నుంచి తొలగించింది. ఆ పార్టీల గుర్తింపును ఎన్నికల గుర్తులను సైతం రద్దు చేసింది.

ఎన్నికల సంఘం తమ జాబితా నుంచి తొలగించిన రాజకీయ పార్టీల జాబితాలో ప్రజాశాంతి పార్టీ కూడా ఉండటం గమనార్హం. కాగా తన పార్టీ గుర్తింపు రద్దుపై ఇంకా కేఏ పాల్ స్పందించలేదు. ఈ వ్యవహారంపై ఆయన ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.