BJP: కన్నాకు.. కౌంటర్! BJPలో చేరిన తులసీ రామచంద్ర ప్రభు
BJP విధాత: BJP రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ సొంత అజెండా అమలు చేస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని చివరకు అధ్యక్ష పదవి నుంచి తప్పించబడి అలాలా మెల్లగా TDPలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు పోటీగా ఇంకో అభ్యర్థిని రెడీ చేస్తోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి TDP నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్న కన్నాకూ చెక్ చెప్పాలని BJP భావిస్తోంది. అదే నియోజకవర్గం నుంచి దాదాపు అదే స్థాయి ఇమేజి.. డబ్బు.. హోదా.. సామాజిక గుర్తింపు […]

BJP
విధాత: BJP రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ సొంత అజెండా అమలు చేస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని చివరకు అధ్యక్ష పదవి నుంచి తప్పించబడి అలాలా మెల్లగా TDPలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు పోటీగా ఇంకో అభ్యర్థిని రెడీ చేస్తోంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి TDP నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్న కన్నాకూ చెక్ చెప్పాలని BJP భావిస్తోంది. అదే నియోజకవర్గం నుంచి దాదాపు అదే స్థాయి ఇమేజి.. డబ్బు.. హోదా.. సామాజిక గుర్తింపు ఉన్న మరో కాపు నాయకుడిని BJP చేర్చుకుంది.
పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్ర ప్రభును, ఆయన కుమారుడు యోగేష్ చంద్ర BJP రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు .. కేంద్ర మంత్రి మురళీధరన్ తదితరుల సమక్షంలో పార్టీలో చేరారు.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన కన్నా ఏనాడూ BJP బలోపేతానికి పెద్దగా పని చేసింది లేదు. దానికితోడు అప్పటికే BJPలో ఉన్న వీర్రాజు తదితరులతో కలిసి పని చేయడాన్ని కన్నా చిన్నతనంగా భావించారు. కాపుల ఓట్లు BJPకి తీసుకొస్తారు అని BJP అధిష్టానం భావించినా ఆయన ఆదిశగా పని చేయలేదు.. అంతేకాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో కన్నా కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేదు. ఇదిలా ఉండగా ఆయన BJPని వీడి TDPలో చేరారు.
ఇప్పుడు కన్నా సామాజిక వర్గానికి చెందిన తులసీ రామచంద్ర ప్రభును చేర్చుకుని కన్నాకు పోటీగా బరిలో దింపుతారు అని అంటున్నారు. వాస్తవానికి ఈ రామచంద్ర ప్రభు 2009లో గుంటూరు వెస్ట్ నుంచి పీఆర్పీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజల్లో ఉంటూ వస్తున్నారు.