Vinod Sharma | నిద్రపోతున్న ప్రధాని.. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు: వినోద్‌శ‌ర్మ

Vinod Sharma బిరేన్‌సింగ్‌ను తొలగించే ధైర్యం లేదు ఆయనను కాపాడుతున్న నరేంద్రమోదీ ఆవేదనతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నా బీహార్‌ బీజేపీ అధికార ప్రతినిధి రాజీనామా మణిపూర్‌: సుదీర్ఘకాలంగా మణిపూర్‌లో మారణహోమం జరుగుతున్న స్పందించని ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్న నేపథ్యంలో తాజాగా సొంత పార్టీ నాయకుడే ఒకరు ప్రధాని వ్యవహారంపై తీవ్ర ఆగ్రహావేశాలు, ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌ మండిపోతుంటే ప్రధాని నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రధాని కింద పని చేయలేనని […]

  • By: Somu    latest    Jul 27, 2023 12:44 AM IST
Vinod Sharma | నిద్రపోతున్న ప్రధాని.. ఇంత దారుణం ఎన్నడూ చూడలేదు: వినోద్‌శ‌ర్మ

Vinod Sharma

  • బిరేన్‌సింగ్‌ను తొలగించే ధైర్యం లేదు
  • ఆయనను కాపాడుతున్న నరేంద్రమోదీ
  • ఆవేదనతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నా
  • బీహార్‌ బీజేపీ అధికార ప్రతినిధి రాజీనామా

మణిపూర్‌: సుదీర్ఘకాలంగా మణిపూర్‌లో మారణహోమం జరుగుతున్న స్పందించని ప్రధాని నరేంద్రమోదీపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్న నేపథ్యంలో తాజాగా సొంత పార్టీ నాయకుడే ఒకరు ప్రధాని వ్యవహారంపై తీవ్ర ఆగ్రహావేశాలు, ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌ మండిపోతుంటే ప్రధాని నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రధాని కింద పని చేయలేనని చెబుతూ.. బీజేపీకి రాజీనామా చేశారు. ప్ర‌ధాని నరేంద్రమోదీకి మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రి బిరేన్‌సింగ్‌ను తొల‌గించే ధైర్యం లేద‌ని బీజేపీ బీహార్‌ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి వినోద్‌శ‌ర్మ ఆరోపించారు.

మ‌ణిపూర్‌లో హింస‌ను అదుపు చేయ‌లేక‌ పోయిన ముఖ్య‌మంత్రి బిరేన్ సింగ్‌ను ప్ర‌ధాని కాపాడుతున్నార‌ని విమ‌ర్శించారు. గురువారం ఆయ‌న బీజేపీకి రాజీనామా చేస్తూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని నిద్ర‌పోతున్నార‌ని అన్నారు. బీజేపీ నాయ‌క‌త్వం కింద ప‌నిచేయ‌డానికి మ‌న‌స్క‌రించ‌డం లేద‌ని చెప్పారు. వంద‌లాది మంది స‌మ‌క్షంలో ఇద్ద‌రు మహిళలను న‌గ్నంగా ఊరేగించిన సంఘ‌ట‌న అంత‌ర్జాతీయంగా దేశం ప‌రువు తీసింద‌ని అన్నారు.

ఇటువంటి సంఘ‌ట‌న‌లు చాలా జ‌రిగాయి అంటూ ముఖ్య‌మంత్రి బిరేన్‌సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. చాలా భార‌మైన హృద‌యంతో పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇంత దారుణం మునుపెన్న‌డూ జ‌రుగ‌లేద‌ని పేర్కొంటూ తాను పార్టీ అధ్య‌క్షుడికి లేఖ రాసిన‌ట్టు శ‌ర్మ తెలిపారు. ‘ప్ర‌ధాని ఇంకా నిద్ర‌పోతున్నారు. ఆయ‌నకు ముఖ్య‌మంత్రి బిరేన్‌సింగ్‌ను తొలగించే ధైర్యం లేదు’ అని శ‌ర్మ విమ‌ర్శించారు.

‘మ‌ణిపూర్ బిడ్డ‌ల‌ను న‌గ్నంగా ప‌రేడ్ చేయించ‌డం ప్ర‌పంచం అంత‌టా దేశం ప‌రువుతీసింది. ఈ ఘ‌ట‌న‌కు ముఖ్య‌మంత్రి బిరేన్‌సింగ్ బాధ్యులు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దానిని స‌మ‌ర్థిస్తున్నారు. ఇటువంటి నాయ‌క‌త్వం కింద ప‌నిచేయ‌డానికి నా మ‌న‌స్సు అంగీక‌రించ‌డం లేదు. త‌ప్పు చేస్తున్నామ‌న్న భావ‌న క‌లుగుతున్న‌ది. అందుకే పార్టీలో అన్ని ప‌ద‌వుల‌కూ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేస్తున్నా’ అని శ‌ర్మ పేర్కొన్నారు.