UP Municipal Election Result 2023 | యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా
విధాత: ఉత్తర్ ప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో (UP Municipal Election Result 2023) బీజేపీ దూసుకుపోతోంది. 17 మున్సిపల్ కార్పొరేషన్ల తో పాటు నగర పాలిక పరిషత్‌లు, నగర పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల ప్రకారం.. బీజేపీ కనీసం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం సాధిస్తుండగా.. బీఎస్పీ రెండు మేయర్ పదవులను దక్కించుకునే అవకాశముంది. మిగతా స్థానాల్లో హోరాహోరీగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. 80 ఎంపీ […]

విధాత: ఉత్తర్ ప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో (UP Municipal Election Result 2023) బీజేపీ దూసుకుపోతోంది. 17 మున్సిపల్ కార్పొరేషన్ల తో పాటు నగర పాలిక పరిషత్‌లు, నగర పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల ప్రకారం.. బీజేపీ కనీసం 10 మున్సిపల్ కార్పొరేషన్లలో విజయం సాధిస్తుండగా.. బీఎస్పీ రెండు మేయర్ పదవులను దక్కించుకునే అవకాశముంది.
మిగతా స్థానాల్లో హోరాహోరీగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో.. 80 ఎంపీ సీట్లున్న ఉత్తర్‌ప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి.
కీలక ఫలితాలు
- ఝాన్సీ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ అభ్యర్థి బిహారీ లాల్ ఆర్య భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
- వారణాసిలో కేజ్రివాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా దెబ్బతింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 300 ఓట్లు మాత్రమే పడ్డాయి.
- ఆగ్రాలో మాయావతికి చెంది బహుజన సమాజ్‌పార్టీ ముందంజలో ఉంది.