BJP
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడీల పాలన అంతమే తమ పంతం అని బీజేపీ నూతన సారథి, కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పొత్తులు, ఒప్పందాలు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మాత్రమే చేసుకుంటాయి. బీజేపీపై తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. బీఆర్ఎస్‌ను పాతరేసి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో, దేశంలో అధికారం పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌దేనని, తమకు ఎవ్వరి పొత్తులు అవసరం లేదన్నారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన వారికి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చారని, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లేనన్నారు.
ఆ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని, భవిష్యత్‌లో బీఆర్ఎస్‌తో కలసే ప్రసక్తే లేదన్నారు. వారి సహకారం మాకు అవసరం లేదని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి తీరుతామన్నారు. ఒక్క కుటుంబం చేతిలో తెలంగాణ బంధీ అయిందన్నారు కిషన్ రెడ్డి. దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూం ఇళ్ళు సహా.. నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారన్నారు.
బీఆర్ఎస్ ను కాపాడాలనే ఉద్దేశంతో కొంతమంది బిజెపి మీద విషప్రచారం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో కానీ, గతంలో కానీ పొత్తులు పెట్టుకున్నది, ఒప్పందాలు కుదుర్చుకున్నది, పదవులు పంచుకున్నది కాంగ్రెస్ – బీఆర్ఎస్ పార్టీలు మాత్రమే.
చేయి గుర్తు మీద గెలిచి కారెక్కి మంత్రులు అయిన పార్టీలకు… pic.twitter.com/uEPm66h37n
— G Kishan Reddy (@kishanreddybjp) July 6, 2023
ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుకూలంగా బీజేపీ పరిపాలన ఉంటోందని, లక్ష్మణ్, బండి సంజయ్ నాయకత్వంలో మంచి ఫలితాలను సాంధించామన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో బీఆర్ఎస్‌ను పాతరేయటానికి ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. నైతిక విలువలతో కూడిన రాజకీయాలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలం ఉంటోంది కానీ.. పేదలకు ఇవ్వటానికి స్థలం లేదా? కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పాతబస్తీ ఫలక్‌నామా వరకు మెట్రోను ఎందుకు పొడిగించలేదో కేసీఆర్ చెప్పాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వలనే అనేక రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయాయని, ఎస్సీ విద్యార్ధులకు కేంద్రం స్కాలర్‌షిప్‌లు ఇస్తామంటే కేసీఆర్ సర్కార్ అడ్డుకుంటుందన్నారు. దశాబ్ది ఉత్సవాలు కేసీఆర్ కుటుంబానికి మాత్రమేనని, వరంగల్‌లో ప్రధాన మంత్రి మోదీ పర్యటనను విజయవంతం చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
కలిసి పని చేస్తాం.. బీజేపీని అధికారంలోకి తీసుకువస్తాం: బండి సంజయ్ కుమార్
కిషన్ రెడ్డి, తనకు మధ్య సఖ్యత, అత్యంత చనువు ఉందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర బీజేపీలో తనను రారా,, పోరా అనేది ఒక్క కిషన్ రెడ్డి మాత్రమేనని, పార్టీ కోసం నాయకులందరం కలిసి పని చేస్తామన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులను నిర్వహించిన కిషన్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గడీల పాలనను పడగొట్టి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామన్నారు.
ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ నాయకులను ఒప్పించిన నాడు పార్లమెంట్‌లో మద్దతు తెలపడంలో కిషన్ రెడ్డి కీలక భూమిక పోషించారన్నారు. ప్రధాని మోడీ సూచన మేరకు రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనపై ఐఖ్యంగా పోరాడుతమన్నారు.
తమ పార్టీలో నాయకుల మధ్య విబేదాలున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. అలాంటి తప్పుడు ప్రచారం ను పట్టించుకోమని తెలిపారు. ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.