BJP | దేశానికి సుపరిపాలన అందిస్తున్న ప్రధాని మోడీ

BJP కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల పార్టీ దళిత కార్యకర్త ఇంట్లో అల్పాహారం విధాత, మెదక్ బ్యూరో : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో సుపరి పాలన అందిస్తుందని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపెట్ మండల కేంద్రంలో బీజేపీ దళిత సామాన్య కార్యకర్త భూపాల్ నివాస గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం శంకరంపెట్ ఎకశిల సోమేశ్వరాలయంలో అభిషేకం, ప్రత్యేక […]

  • By: krs    latest    Jul 17, 2023 1:50 PM IST
BJP | దేశానికి సుపరిపాలన అందిస్తున్న ప్రధాని మోడీ

BJP

  • కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల
    పార్టీ దళిత కార్యకర్త ఇంట్లో అల్పాహారం

విధాత, మెదక్ బ్యూరో : కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో సుపరి పాలన అందిస్తుందని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపెట్ మండల కేంద్రంలో బీజేపీ దళిత సామాన్య కార్యకర్త భూపాల్ నివాస గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం శంకరంపెట్ ఎకశిల సోమేశ్వరాలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాయంపేట మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డిని ఆయన స్వగృహం పోలంపల్లిలో కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా రూపాల మాట్లాడుతు రైతుల కోసం పంటల మద్దతు ధర పెంచడంతో పాటు తెలంగాణ రైతుల ధాన్యాన్ని మోడీ ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసిందన్నారు. ప్రపంచంలో దేశఖ్యాతిని పెంచేలా మోడీ పాలన సాగుతుందన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి పార్టీ నాయకత్వం కృషి చేస్తుందన్నారు.

ఏడు నియోజకవర్గాల పార్టీ ముఖ్యులతో రూపాల భేటీ

మెదక్ పార్లమెంటు నియోజకవర్గం లోని ఏడు శాసన సభ నియోజకవర్గాలలోని ముఖ్య నాయకులు ,కార్యకర్తలతో, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మంత్రి పురుషోత్తం రూపాల విడివిడి గా సమావేశం అయ్యారు. మెదక్ నియోజక వర్గం టికెట్ ఆశిస్తున్న ఆరుగురు పార్టీ ఆశావహులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నందు జనార్దన్ రెడ్డి, న్యాయవాది రాజశఖర్ ,నందారెడ్డి, రామ్చరణ్ యాదవ్, మాజీ మంత్రి కోడలు కరణం పరిణితిలతో మంత్రి ప్రతేకంగా మాట్లాడారు. పార్టీ అనుబంధ విభాగాలతో భేటీ అయ్యారు. అంతకుముందు సోమేశ్వరాలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, పరిణిత, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్, ఎక్కల దేవి మధు, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నందా రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు