లెబనాన్‌లో పడవ ప్రమాదం.. 89 మంది మృతి
విధాత: లెబనాన్ నుంచి దాదాపు 150 మందితో బయలుదేరిన పడవ సిరియా తీరానికి సమీపన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 89 మంది మరణించారు. గల్లంతైన వారిలో 20 మందిని కాపాడారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతులు లెబనాన్, పాలస్తీనా, సిరియా దేశస్థులుగా గుర్తించారు. లెబనాన్ నుంచి 150 మంది శరణార్థులతో యూరప్ దేశాలకు వలస వెళ్తుండగా ఈ పడవ ప్రమాదం జరిగింది. లెబనాన్‌లో తీవ్రమైన […]

విధాత: లెబనాన్ నుంచి దాదాపు 150 మందితో బయలుదేరిన పడవ సిరియా తీరానికి సమీపన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 89 మంది మరణించారు. గల్లంతైన వారిలో 20 మందిని కాపాడారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది.
మృతులు లెబనాన్, పాలస్తీనా, సిరియా దేశస్థులుగా గుర్తించారు. లెబనాన్ నుంచి 150 మంది శరణార్థులతో యూరప్ దేశాలకు వలస వెళ్తుండగా ఈ పడవ ప్రమాదం జరిగింది. లెబనాన్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొన్నేళ్లుగా భారీగా వలసలు సాగుతున్నాయి. ఉగ్రవాదం, ఆర్థిక అస్థిరత్వం మధ్య లెబనాన్ పౌరులు వలస పోతున్నారు.