రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా

-రిటైల్ లోన్ లెండింగ్ రేటు పావు శాతం పెంపు -9.1 శాతానికి చేరిన‌ గృహ‌, ఆటో, విద్య‌, వ్య‌క్తిగ‌త రుణాల‌ వ‌డ్డీరేట్లు విధాత‌: రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోబీ) పెంచింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధ‌వారం రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విష‌యం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే గురువారం బ‌రోడా రెపో ఆధారిత లెండింగ్ రేటు పావు శాతం పెరిగింది. బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో గృహ‌, వాహ‌న‌, విద్యా, […]

రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా

-రిటైల్ లోన్ లెండింగ్ రేటు పావు శాతం పెంపు
-9.1 శాతానికి చేరిన‌ గృహ‌, ఆటో, విద్య‌, వ్య‌క్తిగ‌త రుణాల‌ వ‌డ్డీరేట్లు

విధాత‌: రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను బ్యాంక్ ఆఫ్ బ‌రోడా (బీవోబీ) పెంచింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధ‌వారం రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విష‌యం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే గురువారం బ‌రోడా రెపో ఆధారిత లెండింగ్ రేటు పావు శాతం పెరిగింది.

బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో గృహ‌, వాహ‌న‌, విద్యా, వ్య‌క్తిగ‌త రుణాల‌పై వ‌డ్డీరేట్లు 9.10 శాతానికి చేరాయి. ఇంత‌కుముందు 8.85 శాతంగా ఉండేవి. పెరిగిన వ‌డ్డీరేట్లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఈ ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ తెలిపింది. అయితే ఉద్యోగులు, ఉద్యోగేత‌రుల‌కు వ‌ర్తించే వ‌డ్డీరేట్ల‌లో స్వ‌ల్ప తేడాలున్నాయి. 8.85 శాతం నుంచి 10.55 శాతం మ‌ధ్య ఈ వ‌డ్డీరేట్లున్నాయి.