Parineeti Chopra | ఎంపీ రాఘవ్ చద్దాతో రిలేషన్‌పై స్పందించిన బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.. వీడియో వైరల్
Parineeti Chopra | ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే, దీనిపై ఎంపీ రాఘవ్ చద్దాను ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. కానీ, రిలేషన్‌షిప్‌పై పరిణీతి చోప్రా స్పందించింది. మాటల్లో కాదండోయ్.. తన హావభావాలతో అవునన్నట్లుగానే చెప్పింది. ముంబయి ఎయిర్‌పోర్టులో నటి కనిపించగా ఎంపీతో రిలేషన్ షిప్‌పై వస్తున్న రూమర్స్‌పై ఫొటోగ్రాఫర్లు […]

Parineeti Chopra | ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో రిలేషన్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే, దీనిపై ఎంపీ రాఘవ్ చద్దాను ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు. కానీ, రిలేషన్‌షిప్‌పై పరిణీతి చోప్రా స్పందించింది. మాటల్లో కాదండోయ్.. తన హావభావాలతో అవునన్నట్లుగానే చెప్పింది. ముంబయి ఎయిర్‌పోర్టులో నటి కనిపించగా ఎంపీతో రిలేషన్ షిప్‌పై వస్తున్న రూమర్స్‌పై ఫొటోగ్రాఫర్లు ప్రశ్నించారు. దీనికి పరిణీతి సిగ్గుపడుతూ వెళ్లిపోయింది.
ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న బ్యూటీని ఓ ఫొటోగ్రాఫర్ రూమర్స్‌పై ప్రశ్నించాడు. ‘మేడమ్.. మీరు డేటింగ్‌లో ఉన్నారని వస్తున్న వార్తలు నిజమేనా?’ అని అడిగాడు. దీనికి పరిణీతి నవ్వుతూ బాయ్, గుడ్ నైట్ అంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఇద్దరు ఓ రిస్టారెంట్‌లో డిన్నర్ చేస్తూ మీడియా కంటపడ్డారు. ఆ తర్వాత మార్చి 23న ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి పాల్గొనడంతో పాటు ఒకే కారులో వెళ్లిపోయారు. ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో ఇటు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటనలతో రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా రిలేషన్లో ఉన్నది నిజమేనంటూ ప్రచారం మొదలైంది. మరో వైపు ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల పరిణీతి చోప్రా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాను కలిసింది. దాంతో పెళ్లికి ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేయించుకునేందుకు డిజైనర్‌ను కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే ఢిల్లీకి చెందిన ఓ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సైతం ఇద్దరికి శుభాకాంక్షలు తెలుపడం విశేషం.
రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నది. గతంలో ఆయనకు యువతులు తమను పెళ్లి చేసుకోమని సోషల్ మీడియా వేదికగా కోరడం విశేషం. అలాగే ఢిల్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సమయంలోనూ పెళ్లి ప్రపోజల్స్ భారీగానే వచ్చాయి. మరో వైపు పరిణీతి చోప్రా 2011లో ‘లేడీస్ Vs రికీ బహ్ల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ‘చమ్కిలా’, ‘క్యాప్సూల్ గిల్’ సినిమాల్లో పని చేస్తున్నది.
View this post on Instagram