‘Ramayana’| బాలీవుడ్ ‘రామాయణ’ అప్ డేట్ వైరల్

‘Ramayana’| బాలీవుడ్ ‘రామాయణ’ అప్ డేట్ వైరల్

విధాత: బాలీవుడ్ నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘రామాయణ’ సినిమా తాజా అప్ డేట్ వైరల్ గా మారింది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో నిర్మితమవుతునున్న రామాయణ సినిమా టైటిల్ గ్లింప్సును ఈ నెల 3వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర నిర్మాణ యూనిట్ సన్నాహాలు చేస్తుండటం ఆసక్తిరేపింది. బెంగుళూర్ లో జరుగనున్న ఆ ఈవెంట్‌ కు హాజరయ్యేందుకు రామాయణ టీమ్‌ మొత్తం బయల్దేరుతున్న వీడియోలు ఎక్స్‌లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రామాయణ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు వీడియోలు ఎక్స్ లో వైరల్ అవుతున్నాయి. రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్‌ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

రెండు భాగాలుగా రామాయణ సినిమా మొదటి పార్ట్‌ షూటింగ్‌ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈమేరకు చిత్రబృందం సంబరాలు చేసుకుంటోన్న వీడియోలు కూడా ఎక్స్‌లో కనిపిస్తున్నాయి. ఆ వీడియోలలో మూవీ టీమ్‌ అందరికీ రణ్‌బీర్‌ కపూర్‌, నితేశ్‌ తివారీలు ధన్యవాదాలు చెబుతూ కనిపిస్తున్నారు. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఈ సినిమా నిర్మాణంపై తాజాగా రణబీర్ కపూర్ స్పందించారు. ‘‘రామాయణ ప్రాజెక్ట్‌లో వర్క్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని.. ఇది ఎంతో గొప్ప కథ అని.. చిన్నప్పటినుంచి వింటూ పెరిగామని చెప్పుకొచ్చారు. ఎంతోమంది ప్రతిభావంతులైన కళాకారులు ఈ సినిమాలో పనిచేస్తున్నారని..నితీశ్‌ తివారీ దర్శకత్వంలో ఎంతో అద్భుతంగా తెరకెక్కుతుందని రణ్‌బీర్‌ వెల్లడించారు.