TRSకు బూర రాజీనామా.. రాజకీయ వెట్టి భరించలేకనే.. KCRపై సంచలన కామెంట్స్
విధాత,హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్కు లేఖ రాశారు. నాకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా చాలా అవమానానికి గురయ్యాను. అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. ఆత్మగౌరవ సభలకు ఉద్దేశ పూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు. తెలంగాణలో బీసీలు వివక్షకు గురవుతున్నారని నర్సయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎంపీ ఎన్నికల్లో నా ఓటమి వెనుక సొంత పార్టీ నేతల […]

విధాత,హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి బూర నర్సయ్య గౌడ్ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్కు లేఖ రాశారు. నాకు సమాచారం ఇవ్వకుండా మునుగోడు అభ్యర్థిని ప్రకటించారు. నేను వ్యక్తిగతంగా చాలా అవమానానికి గురయ్యాను.

అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. ఆత్మగౌరవ సభలకు ఉద్దేశ పూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు. తెలంగాణలో బీసీలు వివక్షకు గురవుతున్నారని నర్సయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎంపీ ఎన్నికల్లో నా ఓటమి వెనుక సొంత పార్టీ నేతల కుట్ర ఉంది.

బీసీలకు టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అడగడం నేరమా? అని ప్రశ్నించారు. పార్టీకి నా అవసరం లేదని భావిస్తున్నాను. నాకు అవమానం జరుగుతుందని కేసీఆర్కు తెలిసినా పట్టించుకోలేదు. కేసీఆర్ను కలవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉందని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా త్వరలో పార్టీ వీడనున్నట్లు సమాచారం.
