Parliament: పార్లమెంటు ఉభయసభలు.. సోమవారానికి వాయిదా

విధాత‌: పార్లమెంటు(Parliament) బడ్జెట్‌(Budjet) సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదాపడ్డాయి. కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) దేశంపై లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ(BJP) సభ్యులు పట్టుపట్టగా.. లోక్‌సభ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా మార్చి 20కి వాయిదా పడింది. రాహుల్‌ క్షమాపణ చెప్పకుండా ఆయనను సభలో మాట్లాడనిచ్చే ప్రసక్తే లేదని బీజేపీ సభ్యులు తేల్చి చెప్పారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి […]

  • Publish Date - March 17, 2023 / 01:07 PM IST

విధాత‌: పార్లమెంటు(Parliament) బడ్జెట్‌(Budjet) సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదాపడ్డాయి.

కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) దేశంపై లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని అధికార బీజేపీ(BJP) సభ్యులు పట్టుపట్టగా.. లోక్‌సభ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా మార్చి 20కి వాయిదా పడింది.

రాహుల్‌ క్షమాపణ చెప్పకుండా ఆయనను సభలో మాట్లాడనిచ్చే ప్రసక్తే లేదని బీజేపీ సభ్యులు తేల్చి చెప్పారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. అదానీ వ్యవహారంలో జేపీసీ వేయాలని విపక్ష సభ్యులు, రాహుల్‌ క్షమాపణ చెప్పాలని అధికారపక్ష సభ్యులు నినాదాలు చేయగా.. సభా కార్యకలాపాలు సాగలేదు. ఈ పరిస్థితుల్లో సభ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.