Yaduvansh Kumar Yadav |బ్రాహ్మణులు రష్యన్లు వారిని వెనక్కు పంపాలి: RJD నేత

RJD leader | BIHAR | RJD Leader Yaduvansh Kumar Yadav విధాత: బ్రాహ్మణులు రష్యా నుంచి వచ్చారని, వారిని పంపించి వేయాలని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే యదువంశ్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. బిహారులోని సుపాల్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏప్రిలు 29న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బ్రాహ్మణులు ఈ దేశానికి చెందిన వారు కాదని డీఎన్‌ఏ పరీక్షలు వెల్లడిస్తున్నాయి. వారు మనలను విభజించి పాలిస్తున్నారు. వారిని ఇక్కడి నుంచి తరిమి […]

  • By: krs    latest    May 09, 2023 8:45 AM IST
Yaduvansh Kumar Yadav |బ్రాహ్మణులు రష్యన్లు వారిని వెనక్కు పంపాలి: RJD నేత

RJD leader | BIHAR | RJD Leader Yaduvansh Kumar Yadav

విధాత: బ్రాహ్మణులు రష్యా నుంచి వచ్చారని, వారిని పంపించి వేయాలని ఆర్జేడీ నేత, మాజీ ఎమ్మెల్యే యదువంశ్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. బిహారులోని సుపాల్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏప్రిలు 29న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘బ్రాహ్మణులు ఈ దేశానికి చెందిన వారు కాదని డీఎన్‌ఏ పరీక్షలు వెల్లడిస్తున్నాయి. వారు మనలను విభజించి పాలిస్తున్నారు. వారిని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి’ అని ఆయన మాట్లాడారు.

ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారి ఆలస్యంగా బయటికి వచ్చాయి. యాదవ్‌ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం సృష్టించాయి. బీజేపీ, జేడీయూ రెండూ యాదవ్‌ వ్యాఖ్యలను ఖండించాయి.