Britania | ఒక్క పదం పలుకడం నేర్పితే రూ.3 లక్షల స్టైఫండ్‌.. ఎక్కడో తెలుసా..?

Britania | ఒక్క పదం పలుకడం నేర్పితే రూ.3 లక్షల స్టైఫండ్‌.. ఎక్కడో తెలుసా..?

Britania : సాధారణంగా ఇంటర్న్‌షిప్‌ అంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. నెలంతా కష్టపడితే వచ్చే స్టైఫండ్‌ కూడా తక్కువే. కానీ భారత దేశానికే చెందిన ఓ కంపెనీ మాత్రం ఆసక్తికరమైన ఇంటర్న్‌షిప్‌ తీసుకొచ్చింది. కేవలం ఒక్క రోజు పని చేస్తే చాలు రూ.లక్షల్లో సంపాదించే అవకాశం వస్తే కల్పించింది. ఒక్క రోజులోనే రూ.లక్షలు సంపాదించండి అంటూ ప్రకటన విడుదల చేసింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం…

వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కే చెందిన బ్రిటానియా కంపెనీ అర్ధచంద్రాకారంలో ఉండే ఫ్రెంచ్‌ పేస్ట్రీ ‘Croissant’ ను తయారు చేస్తోంది. అయితే ఆ సంస్థలోని ఉద్యోగులు ఈ పదాన్ని స్పష్టంగా పలకలేకపోతున్నారట. దాంతో సిబ్బందికి ఎలాగైనా ఆ పదాన్ని ఉచ్చరించడం నేర్పించాలని కంపెనీ నిర్ణయించింది. అందుకోసం ఆసక్తికరమైన ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది.

ఈ ఇంటర్న్‌షిప్‌ నెల రోజులో, వారం రోజులో కాదు. కేవలం ఒక్క రోజు మాత్రమే. సంస్థలోని ఉద్యోగులకు ఆ పదాన్ని పలుకడం ఒక్కరోజులో నేర్పిస్తే చాలట. నేర్పించిన వారికి ఏకంగా రూ.3 లక్షల స్టైఫండ్‌ ఇస్తుందట. ఈ ఉద్యోగానికి సంబంధించిన ప్రకటనను కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. పేరు, వయసు, ఇ-మెయిల్‌ తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. దరఖాస్తుకు ఇవాళే ఆఖరు తేదీ. ఆ పద ఉచ్ఛారణ తెలిస్తే ఈ ఇంటర్న్‌షిప్‌పై మీరూ ఓ లుక్కేయండి.