మేం కాదు.. BRS 37 మంది MLAలను కొనుగోలు చేసింది.. కోర్టుకు జాబితా సమర్పించిన BJP

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సోమవారానికి వాయిదా విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని, బీఆర్‌ ఎస్‌ పార్టీనే 2014 నుండి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని బీజేపీ కోర్టుకు తెలిపింది. ఈ మేరకు బీజేపీ ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పించింది. శుక్రవారం ఈ కేసుపై హై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ విషయంపై జోక్యం […]

  • By: krs    latest    Jan 06, 2023 1:09 PM IST
మేం కాదు.. BRS 37 మంది MLAలను కొనుగోలు చేసింది.. కోర్టుకు జాబితా సమర్పించిన BJP
  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సోమవారానికి వాయిదా

విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని, బీఆర్‌ ఎస్‌ పార్టీనే 2014 నుండి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని బీజేపీ కోర్టుకు తెలిపింది.

ఈ మేరకు బీజేపీ ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పించింది. శుక్రవారం ఈ కేసుపై హై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ విషయంపై జోక్యం చేసుకున్నహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇది కేవలం బీఆర్‌ఎస్‌, బీజేపీల పంచాయతీ కాదని, చట్టానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి బీఆర్‌ఎస్‌ పార్టీ లోకి చేర్చుకుందని బీజేపీ వాదన చేసింది. తాము ఎక్కడా కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేదని బీజేపీ వాదించింది. కాగా కేసు విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదని సీబీఐ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి బెంజ్‌ కేసును సోమవారానికి వాయిదా వేసింది.