105రోజుల్లో 16,400కోట్ల అప్పులు.. బీఆరెస్ ట్వీట్
రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందంటూ పదేపదే కాంగ్రెస్ పాలకులు తమను బద్నాం చేస్తున్నారంటున్న బీఆరెస్ నేతలు తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పుల మాటేమిటంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు

- పెరగని పింఛన్లు…అందని రైతుబంధు
- తెచ్చిన అప్పులు ఎటు పోయాయంటు నిలదీత
విధాత, హైదరాబాద్: రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిందంటూ పదేపదే కాంగ్రెస్ పాలకులు తమను బద్నాం చేస్తున్నారంటున్న బీఆరెస్ నేతలు తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పుల మాటేమిటంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 105 రోజుల్లో రూ. 16,400 కోట్ల అప్పు చేసిందని బీఆరెస్ ట్వీట్ చేసింది.
రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసినప్పటికి కాంగ్రెస్ చెప్పిన హామీ మేరకు పింఛన్లు పెరుగలేదని, రైతుబంధు అందలేదని, మరి తెచ్చిన అప్పులన్ని ఎక్కడికి పోతున్నయ్? కాంగ్రెస్ ఖజానాలోకా.. లేక రేవంత్ జేబులోకా? అంటు ప్రశ్నించింది. ట్వీట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఏ నెలలో ఎంత అప్పు చేశారన్న వివరాలను బీఆరెస్ పొందుపరిచింది.