అది BRS సభ మాత్రమే.. నితీశ్‌ మాటలు అందుకేనా?

విధాత: బీఆర్‌ఎస్‌ ఆవిర్బావ సభపై బీహార్‌ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ యేతర పక్షాలతో కలిసి సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదని, తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా వెళ్లేవాడిని కాదన్నారు. సావధాన్‌ యాత్ర. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఉన్నందున తాను హాజరు కాలేదని దానికి కారణం చెప్పారు. అట్లనే స్వప్రయోజనాలు ఏమీ కోరుకోవడం లేదు, జాతీ ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటి పైకి […]

  • By: krs    latest    Jan 20, 2023 9:15 AM IST
అది BRS సభ మాత్రమే.. నితీశ్‌ మాటలు అందుకేనా?

విధాత: బీఆర్‌ఎస్‌ ఆవిర్బావ సభపై బీహార్‌ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ యేతర పక్షాలతో కలిసి సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం గురించి తనకు సమాచారం లేదని, తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ అందినా వెళ్లేవాడిని కాదన్నారు. సావధాన్‌ యాత్ర. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలు ఉన్నందున తాను హాజరు కాలేదని దానికి కారణం చెప్పారు. అట్లనే స్వప్రయోజనాలు ఏమీ కోరుకోవడం లేదు, జాతీ ప్రయోజనాల కోసం విపక్ష నేతలంతా ఏకతాటి పైకి వచ్చి సాగితే చూడాలని ఉన్నది, తెలంగాణలో అది జరిగింది. అయితే బీఆర్‌ఎస్‌కు సంబంధించిన సభ మాత్రమే. కొత్త కూటమి ఏర్పాటు కోసం నిర్వహించిన సభగా దీన్ని చూడకూడదన్నారు.

బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా విపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలని కోరుకుంటూ.. నితీశ్‌ ఈ దిశగా సోనియా గాంధీ, మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితరులతో ఆ మధ్య భేటీ అయ్యారు. యూపీఏ, ఎన్డీఏ కూటములకు దూరంగా తటస్థంగా ఉంటున్నవారందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి ఆ కూటమికి తాను ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నారు. బీహార్‌ సీఎంగా మరోసారి కొనసాగే ఆలోచన ఆయనకు లేదు. ఎందుకంటే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ ప్రకటించాక దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఎన్డీఏ కూటమిని నుంచి జేడీయూ వైదొలిగింది.

అనంతరం బీహార్‌లో ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్‌తో జతకట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆర్జేడీతో విభేదాలతో తిరిగి కాషాయ పార్టీతో జట్టు కట్టి తిరిగి అధికారంలోకి వచ్చారు. మళ్లీ బీజేపీకి బైబై చెప్పి తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసిపోయారు. ప్రస్తుతం ఆ కూటమి తరఫున సీఎంగా కొనసాగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలో వెళ్తామన్నారు.

అంటే పరోక్షంగా తాను జాతీయ రాజకీయాలకు వెళ్తానన్న సిగ్నల్స్‌ ఇచ్చారు. అందుకు అనుగుణంగా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా విపక్ష నేతలను ఐక్యం చేసే పని పెట్టుకున్నారు. అది ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయింది. ఈలోగా కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ రాజకీయాలపై మాట్లాడుతుండటం, కాంగ్రెస్‌, బీజేపీయేతర సీఎంలతో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలతో సంప్రదింపులు చేశారు.

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ సీఎంలతో పాటు వామపక్ష జాతీయ నేతలను ఆహ్వానించి బల ప్రదర్శన చేశారు. ఈ వేదిక నుంచే ఆయన బీజేపీపై, ప్రధాని మోడీపై తీవ్రమైన విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ యేతర కిసాన్‌ ప్రభుత్వం రావాలని కోరారు. అయితే కాంగ్రెస్‌ లేకుండా మరో కూటమి సాధ్యం కాదని శివసేన, ఎన్సీపీ, జేడీయూ, ఆర్జేడీ లాంటి పార్టీలు మొదటి నుంచి స్పష్టంగా చెబుతున్నాయి.

అలాగే కాంగ్రెస్‌తో కలిసి బీహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్‌ బీఆర్‌ఎస్‌ సభకు రాలేడని, ఒకవేళ ఆయన వస్తే అది వేరే సంకేతానికి దారి తీస్తుందని కేసీఆర్‌కు తెలియదా? అందుకే ఆయన కాంగ్రెస్‌, బీజేపీ యేతర పార్టీలతోనే ముందుకు వెళ్లాలని బావిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ సభను భవిష్యత్తు మార్పునకు సంకేతమని ఆ సభకు వచ్చిన నేతలంతా అన్నారు.

కానీ నితీశ్‌ మాత్రం దీన్నిఅంగీకరించలేపోతున్నారు. నితీశ్‌ జాతీయస్థాయిలో తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా కాంగ్రెస్‌తో వెళ్లడం మినహా మరో మార్గం లేదు. దీన్ని బీఆర్‌ఎస్‌ సభగా మాత్రమే చూడాలని, కొత్త కూటమి ఏర్పాటు కోసం నిర్వహించిన సభగా చూడకూదని అందుకే అన్నారు.