Hanumakonda: BRS నాయకులే కబ్జాదార్లు.. మీరా మమ్మల్ని విమర్శించేదీ?: కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూకబ్జా కేసుల్లో ఖమ్మం జైలుకు వెళ్ళిన వేముల శ్రీనివాస్, నీపై ఉన్న CID కేసు మర్చిపోయావా విద్యాసాగర్ ? మీరు భూకబ్జాలకు పాల్పడుతూ మా నాయకుడిపై నిందలు వేస్తారా ? అంటూ కాంగ్రెస్ జిల్లా ఎస్సీ డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ డివిజన్‌లో ఎవరిని ఎవరు తరిమివేస్తారో రాబోయే […]

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: భూకబ్జా కేసుల్లో ఖమ్మం జైలుకు వెళ్ళిన వేముల శ్రీనివాస్, నీపై ఉన్న CID కేసు మర్చిపోయావా విద్యాసాగర్ ? మీరు భూకబ్జాలకు పాల్పడుతూ మా నాయకుడిపై నిందలు వేస్తారా ? అంటూ కాంగ్రెస్ జిల్లా ఎస్సీ డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు.
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ డివిజన్‌లో ఎవరిని ఎవరు తరిమివేస్తారో రాబోయే రోజుల్లో ప్రజలు చెబుతారని అన్నారు.
తాడిశెట్టి విద్యాసాగర్, వేముల శ్రీనివాస్, మాడిశెట్టి శివ శంకర్, సోదా కిరణ్ మీరు చేసే పనులకు, కబ్జాలకు, అన్యాయాలకు మా జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.
మా నాయకుడు కబ్జా చేసిండు, ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగింది అని అంటున్నారు, మీరే కదా అధికారంలో ఉన్నారు కేసులు పెట్టండి, విచారణ చేయండి అంటూ ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తే జవాబు చెప్పే ధైర్యం లేక కేసులు పెడుతున్నారని విమర్శించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, ఆల్ ఇండియా ఎస్.సి.డిపార్ట్మెంట్ కన్వీనర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, INTUC చైర్మన్ కూర వెంకట్, NSUI జిల్లా అధ్యక్షుడు పల్లకొండ సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్, జిల్లా IT వింగ్ చైర్మన్ వింజమూరి లక్ష్మి ప్రసాద్, బొంత సారంగం, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.