BRS | ఈనెల 17న CM అధ్య‌క్ష‌త‌న BRS పార్టీ లెజిస్లేటివ్ సమావేశం

BRS విధాత: తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన… మే 17న (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. జూన్ 2నుండి 21 వరకు నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపైన, అలాగే అమర వీరుల స్మారక స్తూప ఆవిష్కరణలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం […]

BRS | ఈనెల 17న CM అధ్య‌క్ష‌త‌న BRS పార్టీ లెజిస్లేటివ్ సమావేశం

BRS

విధాత: తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన… మే 17న (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.

జూన్ 2నుండి 21 వరకు నిర్వహించాల్సిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపైన, అలాగే అమర వీరుల స్మారక స్తూప ఆవిష్కరణలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో సీఎం కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులతో సమీక్షించి, పార్టీ పరంగా చెపట్టాల్సిన కార్యక్రమాలు, రానున్న ఎన్నికల సన్నాహాలకు సంబంధించి పార్టీ నేతలకు అవసరమైన సూచనలు ఇస్తారని స‌మాచారం.