BRS | ఢిల్లీలో BRS కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన CM KCR

BRS | విధాత: BRS కేంద్ర కార్యాలయం ఢిల్లీలోప్రారంభమైంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన బీఆర్‌ ఎస్‌ అధినేత, తెలంగాణ CM KCR పార్టీ కేంద్ర కార్యాలయాన్నిప్రారంభించారు. పార్టీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌లోCM KCR ఆసీనులవగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. Live: BRS Party President, CM Sri KCR inaugurating BRS Party Office in New Delhi. https://t.co/M5Nk7IwYLs — BRS Party (@BRSparty) May […]

  • By: krs    latest    May 04, 2023 8:45 AM IST
BRS | ఢిల్లీలో BRS కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన CM KCR

BRS |
విధాత: BRS కేంద్ర కార్యాలయం ఢిల్లీలోప్రారంభమైంది. గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన బీఆర్‌ ఎస్‌ అధినేత, తెలంగాణ CM KCR పార్టీ కేంద్ర కార్యాలయాన్నిప్రారంభించారు. పార్టీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన తన ఛాంబర్‌లోCM KCR ఆసీనులవగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.

పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వేద పండితులు కార్యాలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం ప్రారంభించిన తరువాత సీఎం కేసీఆర్‌కు పార్లమెంటరీ పార్టీ చైర్మన్‌ కె. కేశవరావు, లోక్‌ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావులతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.