కోవ లక్ష్మి ప్రచారం కారు సీజ్

విధాత : అసిఫాబాద్ నియోజకవర్గం బీఆరెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి ఎన్నికల ప్రచారంలో కారు గుర్తు ప్రచారం కోసం తెచ్చుకున్న కారును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. బీఆరెస్ ఎన్నికల గుర్తు అంబాసిడర్ కారు కావడంతో అదే కారుతో ప్రచారం చేస్తే బాగుంటుందనుకున్నారు. అయితే అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని ఆ కంపనీ 20 ఏళ్ల క్రితమే నిలిపివేసింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఇప్పుడు ఆ కార్లు రావడం లేదు. దీంతో కోవలక్ష్మి వర్గీయులు మహారాష్ట్ర నుంచి ఒక పాత అంబాసిడర్ కారు తీసుకవచ్చి, దానికి గులాబీ రంగు వేసి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంచారు. పాత కారుకు గులాబీ రంగులద్ధి ప్రచారానికి ఉపయోగిస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన ఎన్నికల అధికారులు ఆ కారుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.