సీఎం రేవంత్‌రెడ్డితో భేటీయైన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య

సీఎం రేవంత్‌రెడ్డితో చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది

  • By: Somu    latest    Mar 05, 2024 10:36 AM IST
సీఎం రేవంత్‌రెడ్డితో భేటీయైన చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య

విధాత, హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌రెడ్డితో చేవెళ్ల బీఆరెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఇప్పటికే బీఆరెస్ నుంచి పలువురు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు వలస బాట పట్టగా, సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా తరుచు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాను మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినట్లుగా కాలే యాదయ్య చెబుతున్నారు.


కాగా.. ఆ మధ్య బీఆరెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైన తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలువాలంటే పార్టీ హైకమాండ్‌కు సమాచారం ఇచ్చి కలవవచ్చని బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నిర్ధేశించారు. ఈ నేపథ్యంలో మొన్న తెల్లం వెంకట్రావు..ఈ రోజు కాలే యాదయ్యలు ముందుగా బీఆరెస్ హైకమాండ్‌కు సమాచారం ఇచ్చి సీఎం రేవంత్‌ను కలిశారా లేక సొంతంగానే వెళ్లి కలిశారా అన్నదానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిసినప్పుడుల్లా వారు కాంగ్రెస్‌లో చేరేందుకే కలిశారన్న చర్చలు వినిపిస్తుండటం కొసమెరుపు.