BRS | నేడు ఢిల్లీలో BRS కార్యాలయం ప్రారంభం
BRS ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్(BRS) కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కార్యాలయంలో ఉదయం వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం కొత్త భవనంలోకి అడుగుపెడతారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా పాల్గొంటారు. బీఆర్‌ఎస్ భవనంలో కొన్ని పనులు చివరి దశలో ఉన్నాయని, పదిరోజుల్లో […]

BRS
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మించిన బీఆర్‌ఎస్(BRS) కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు. కార్యాలయంలో ఉదయం వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 1.05 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. కార్యాలయ ఆవరణలో పార్టీ జెండా ఎగరవేసిన అనంతరం కొత్త భవనంలోకి అడుగుపెడతారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలంతా పాల్గొంటారు. బీఆర్‌ఎస్ భవనంలో కొన్ని పనులు చివరి దశలో ఉన్నాయని, పదిరోజుల్లో వాటిని పూర్తిచేస్తామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మంత్రి బుధవారం పరిశీలించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మంచి ముహూర్తం ఉన్నందున నేడు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్ బుధవారమే ఢిల్లీ రావల్సి ఉండగా.. ఇక్కడ భారీ వర్షం నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి సీఎం గురువారం ఉదయం బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత సీఎం హస్తినలోనే రెండు రోజులు ఉండి వివిధ పార్టీల విపక్ష నేతలు, వివిధ రంగాల ప్రముఖులతో భేటీ అవుతారని తెలుస్తోంది.