BRS Party | రేపు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సమావేశం

BRS Party | ఈ నెల 10న బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) పార్లమెంటరీ పార్టీ (Parliamentary Party), శాసనసభాపక్షం (Legislature Party)తో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనున్నది. తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మధ్యాహ్నం 2 గంటలకు భేటీకి బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) అధ్యక్షత వహించనున్నారు. విస్తృత స్థాయి సమావేశానికి పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభా సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా […]

BRS Party | రేపు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, కార్యవర్గ సమావేశం

BRS Party | ఈ నెల 10న బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party) పార్లమెంటరీ పార్టీ (Parliamentary Party), శాసనసభాపక్షం (Legislature Party)తో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనున్నది. తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లో మధ్యాహ్నం 2 గంటలకు భేటీకి బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR) అధ్యక్షత వహించనున్నారు.

విస్తృత స్థాయి సమావేశానికి పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభా సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీఎంఎస్‌తో పాటు డీసీసీబీ చైర్మన్లను సమావేశానికి ఆహ్వానించారు. ఆహ్వానితులంతా తప్పనిసరిగా భేటీకి హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ సందర్భంగా భేటీలో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. సమావేశానికి ఇది ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో … ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాలు.. తదితర అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశాలున్నాయి.