Yadadri | బండరాళ్లతో మోదీ.. వ్యక్తి దారుణ హత్య

Yadadri విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా : రామన్నపేట మండలం బోగారం, నిదానపల్లి శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని సూర్యాపేట జిల్లా జమునా నగర్ చెందిన వానరాశి లింగయ్య గా గుర్తించారు. లింగయ్య వ్యవసాయ కూలీల మేస్త్రిగా వ్యవహరిస్తూ కూలీలకు పనులు కల్పిస్తుంటారు. గురువారం రోజున రైతుల వద్ద కూలీ డబ్బులను వసూలు చేసుకుని తాము నివాసం ఉండే చోటుకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోదీ చంపినట్లుగా తెలుస్తుంది. డబ్బుల కోసమే […]

  • By: krs    latest    Aug 04, 2023 12:43 AM IST
Yadadri | బండరాళ్లతో మోదీ.. వ్యక్తి దారుణ హత్య

Yadadri

విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా : రామన్నపేట మండలం బోగారం, నిదానపల్లి శివారులో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని సూర్యాపేట జిల్లా జమునా నగర్ చెందిన వానరాశి లింగయ్య గా గుర్తించారు. లింగయ్య వ్యవసాయ కూలీల మేస్త్రిగా వ్యవహరిస్తూ కూలీలకు పనులు కల్పిస్తుంటారు. గురువారం రోజున రైతుల వద్ద కూలీ డబ్బులను వసూలు చేసుకుని తాము నివాసం ఉండే చోటుకు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో మోదీ చంపినట్లుగా తెలుస్తుంది. డబ్బుల కోసమే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు, క్లూస్ టీమ్స్ పరిశీలించాయి. రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.