Warangal | వరంగల్ బస్టాండ్‌: బస్సు ఢీకొని.. యువకుడు మృతి! ఉద్రిక్తత

అక్కడిక్కడే మృతి బస్సుల అద్దాలు పగులగొట్టిన ప్రయాణీకులు బస్టాండ్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత విధాత వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ (Warangal) బస్టాండ్ లో ఒక యువకున్ని బస్సు ఢీకొనడం అక్కడికక్కడే మృతి చెందాడు . గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు కోపోద్రిక్తులై బస్సులపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రయాణికుల హల్చల్తో కొద్దిసేపు బస్టాండ్ లో ఉద్రిక్తత నెలకొంది. బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన పలువురిని కలిచి వేసింది. బస్సు […]

  • By: Somu    latest    Apr 20, 2023 10:12 AM IST
Warangal | వరంగల్ బస్టాండ్‌: బస్సు ఢీకొని.. యువకుడు మృతి! ఉద్రిక్తత
  • అక్కడిక్కడే మృతి
  • బస్సుల అద్దాలు పగులగొట్టిన ప్రయాణీకులు
  • బస్టాండ్‌లో కొద్దిసేపు ఉద్రిక్తత

విధాత వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ (Warangal) బస్టాండ్ లో ఒక యువకున్ని బస్సు ఢీకొనడం అక్కడికక్కడే మృతి చెందాడు . గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనతో ప్రయాణికులు కోపోద్రిక్తులై బస్సులపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రయాణికుల హల్చల్తో కొద్దిసేపు బస్టాండ్ లో ఉద్రిక్తత నెలకొంది. బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన పలువురిని కలిచి వేసింది.

బస్సు డ్రైవర్ తీరుపై ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా దాడి సంఘటన తెలిసి పోలీసులు హుటా హుటిన అక్కడికి చేరుకొని దాడి చేస్తున్న వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బస్టాండ్లోని మిగతా ప్రయాణికులు ఒక్కసారిగా భయకంపితులయ్యారు.

కొందరు ఏం జరుగుతుందో తెలియక అటు ఇటు పరిగెత్తారు. బస్టాండ్ కొద్దిసేపు ఆందోళనతో అట్టుడికింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి సఫలమయ్యారు. ఇదిలా ఉండగా బస్సు ఢీకొని మృతి చెందిన యువకుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.