GOA: మందుబాబులకు క్యాబ్ సర్వీస్‌.. ప్ర‌భుత్వం ఆదేశాలు.. !

కస్టమర్లను సురక్షితంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల‌దే విధాత‌: మందుబాబులకు గోవా ప్రభుత్వం శుభ‌వార్త తెలిపింది. మందుబాబులకు తప్పనిసరిగా క్యాబ్ సర్వీస్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బార్లు, రెస్టారెంట్లు, క్లబ్‌ల యాజమాన్యాలపై ఉందని గోవా రవాణశాఖ మంత్రి స్పష్టం చేశారు. మద్యం తాగిన వారిని తమ సొంత వాహనాల్లో పంపించ కూడదని, వారికి క్యాబ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది మద్యం తాగి డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడుతుండడంతో వారికి భారీ […]

GOA: మందుబాబులకు క్యాబ్ సర్వీస్‌.. ప్ర‌భుత్వం ఆదేశాలు.. !
  • కస్టమర్లను సురక్షితంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల‌దే

విధాత‌: మందుబాబులకు గోవా ప్రభుత్వం శుభ‌వార్త తెలిపింది. మందుబాబులకు తప్పనిసరిగా క్యాబ్ సర్వీస్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బార్లు, రెస్టారెంట్లు, క్లబ్‌ల యాజమాన్యాలపై ఉందని గోవా రవాణశాఖ మంత్రి స్పష్టం చేశారు. మద్యం తాగిన వారిని తమ సొంత వాహనాల్లో పంపించ కూడదని, వారికి క్యాబ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

చాలా మంది మద్యం తాగి డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడుతుండడంతో వారికి భారీ జరిమానాలు విధించడం, తీవ్రత ఎక్కువగా ఉంటే వాహనం సీజ్ చేయడం, జైలుశిక్ష విధించడం లాంటి కఠిన నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి.

పొలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మందుబాబులు వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగి వారి ప్రాణాలతో పాటు ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని గోవా ప్రభుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

కస్టమర్లు ఏ బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలోనైతే మందు తాగారో వారిని సురక్షితంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి మౌవిన్ గోడిన్హో ఆదేశించారు.