BREAKING: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. కొత్త‌గా 3966 పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి కేబినెట్ ఆమోదం

విధాత: తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గం రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త వినిపించింది. ఇప్ప‌టికే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్స్ కొలువుల‌కు నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న వేళ్ల‌, మ‌రో తీపి క‌బురు అందించింది. మూడు నెల‌ల విరామం త‌ర్వాత స‌మావేశ‌మైన రాష్ట్ర మంత్రివ‌ర్గం పోలీసు శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ […]

  • By: krs    latest    Dec 10, 2022 1:05 PM IST
BREAKING: నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. కొత్త‌గా 3966 పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి కేబినెట్ ఆమోదం

విధాత: తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గం రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు మ‌రో శుభ‌వార్త వినిపించింది. ఇప్ప‌టికే ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్స్ కొలువుల‌కు నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతున్న వేళ్ల‌, మ‌రో తీపి క‌బురు అందించింది. మూడు నెల‌ల విరామం త‌ర్వాత స‌మావేశ‌మైన రాష్ట్ర మంత్రివ‌ర్గం పోలీసు శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది.

బీసీ వెల్పేర్ గురుకులాల్లో 2591 పోస్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్‌

శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది.

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయనీ కేబినెట్‌ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది.

వీటితోపాటు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

బాయ్ ఫ్రెండ్ టార్చర్‌తో.. బట్టల్లేకుండా పరిగెత్తిన బాలయ్య హీరోయిన్