Cabinet Subcommittee | మార్చి నెలాఖరు వరకే పంట కోతలు పూర్తయ్యేలా చర్యలు..

Cabinet Subcommittee రైతులకు అవగాహన కలిగిద్దాం నిర్ణయించిన మంత్రివర్గ ఉపసంఘం విధాత: అకాల వర్షాల భారీ నుంచి పంటలను కాపాడాలంటే ప్రతి ఏటా యాసంగి పంట మార్చి నెలాఖరు వరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న క్యాబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సచివాలయంలోని మూడో […]

  • Publish Date - May 24, 2023 / 02:07 PM IST

Cabinet Subcommittee

  • రైతులకు అవగాహన కలిగిద్దాం
  • నిర్ణయించిన మంత్రివర్గ ఉపసంఘం

విధాత: అకాల వర్షాల భారీ నుంచి పంటలను కాపాడాలంటే ప్రతి ఏటా యాసంగి పంట మార్చి నెలాఖరు వరకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.

రాష్ట్రంలో రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 18న క్యాబినెట్ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం సచివాలయంలోని మూడో అంతస్తు సమావేశ మందిరంలో గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డిలు మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్ష్యతన జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

ఈ మేరకు రైతులను చైతన్యవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ప్రతి ఏటా మార్చి తరువాతనే అకాల వర్షాలు, వడగళ్లు కురుస్తున్నాయని దీంతో పంటలు దెబ్బతిన్న రైతు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని భావించింది.

రైతులకు ఆకాల వర్షాల బాధ తప్పించాలంటే మార్చి నెలాఖరు వరకే పంటలు చేతికి వచ్చేలా చూడాలని అభిప్రాయ పడింది. ఏప్రిల్, మే నెలల్లో కూడా పంటలు భూమిపై ఉండడంతో ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగళ్లకు రైతులు తీవ్రంగా నష్టపోయారని భావించింది.

Latest News