Trivikram: త్రివిక్రమ్ సినిమాలలో ఈ లాజిక్ ఎప్పుడైన గమనించారా..ఆ లాజిక్ తో తీస్తే హిట్టే…!
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. రచయితగా కెరీర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్..ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి అందించారు. త్రివిక్రం పెన్నుకు పదునెక్కువ అనే విషయం మనందరికి తెలిసిందే. సగటు మనిషి జీవితంలో ఎప్పుడు ఎదురయ్యే అంశాలతో ఆయన సినిమాలలోని మాటలు ఉంటాయి.అందుకే అవి ఇట్టే కనెక్ట్ అవుతాయి. అయితే త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలలో ఈ కామన్ పాయింట్ తప్పక ఉంటుంది. అదేంటంటే త్రివిక్రమ్ […]

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. రచయితగా కెరీర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్..ఆ తర్వాత దర్శకుడిగా మారి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి అందించారు. త్రివిక్రం పెన్నుకు పదునెక్కువ అనే విషయం మనందరికి తెలిసిందే. సగటు మనిషి జీవితంలో ఎప్పుడు ఎదురయ్యే అంశాలతో ఆయన సినిమాలలోని మాటలు ఉంటాయి.అందుకే అవి ఇట్టే కనెక్ట్ అవుతాయి. అయితే త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలలో ఈ కామన్ పాయింట్ తప్పక ఉంటుంది. అదేంటంటే త్రివిక్రమ్ తెరకెక్కించే సినిమాలు దాదాపు అ అనే అక్షరంతోనే ఉంటాయి.అతడు, అఆ, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో ఇలా అ అనే అక్షరంతో తన సినిమాలకి టైటిల్స్ పెడతాడు.
ఇక తన సినిమా లో హీరోలు తప్పని సరిగా బ్యాగులు సర్ధుకుని ప్రయాణం చేసేలా కథ రాస్తాడు. పవన్ కళ్యాణ్ అత్తారింటి దారేది.. సినిమా చూస్తే ఇందులో హీరో తన అత్త కోసం బ్యాగ్ సర్ధుకుని ఇండియా కు వస్తాడు. ఇక పవన్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా లో కూడా నక్సలైట్ నుంచి జన జీవన శ్రవంతి లోకి రావడానికి బ్యాగ్ తగిలించుకుంటాడు పవన్. ఇక అజ్ఞాతవాసి చిత్రంలోను పవన్ తన కుటుంబానికి దూరంగా ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు మాత్రం బ్యాగ్ వేసుకొని వస్తాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రంలో కూడా ఎన్టీఆర్‌తో బ్యాగ్ మోయించాడు త్రివిక్రమ్.
అల వైకుంఠ పూరం లో సినిమా లో హీరో పుట్టిన కొద్ది నిమిషాలలో మరో చోటికి వెళతాడు. జులాయి సినిమాలో హీరో తను మరణించినట్టు నమ్మించడానికి విశాఖపట్నం వెళ్తాడు. ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అన్ని సినిమాలలో కూడా హీరో బ్యాగ్ పట్టు కుని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే అన్నట్టుగా ఉంటాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో గుంటూరు కారం అనే మాస్ చిత్రం చేస్తున్నాడు త్రివిక్రమ్. మరి ఇందులో మహేష్ తో కూడా మాటల మాంత్రికుడు బ్యాగ్ మోయిస్తాడా లేదా అనేది చూడాలి.