Poonam Pandey | బాలీవుడ్ ఐటమ్ బాంబ్ పూనమ్ పాండేపై ఎఫ్‌ఐఆర్..!
గత శుక్రవారం బాలీవుడ్ సినీ పరిశ్రమను ఓ వార్త షాక్‌కు గురి చేసింది. నటి, మోడల్ పూనమ్ మృతి చెందిందని అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్

Poonam Pandey | గత శుక్రవారం బాలీవుడ్ సినీ పరిశ్రమను ఓ వార్త షాక్‌కు గురి చేసింది. నటి, మోడల్ పూనమ్ మృతి చెందిందని అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె సర్వైకల్ క్యాన్సర్‌తో మృతి చెందినట్లుగా ఆ మేనేజర్ పేర్కొన్నారు. అయితే, చాలా మంది మరణవార్తను తోసిపుచ్చారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనంటూ కొట్టిపడేశారు. ఒక రోజు తర్వాత పూనమ్ పాండే స్వయంగా సోషల్ మీడియా అకౌంట్‌లో వీడియోను విడుదల చేసింది. తాను బ్రతికే ఉన్నానని.. గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఈ పని చేశానని చెప్పుకొచ్చింది. పబ్లిసిటీ కోసం చనిపోయానంటూ చెప్పడంపై పూనమ్ పాండేను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే, మరో వైపు పూనమ్ పాండేపై శనివారం న్యాయవాది అలీ కాషిఫ్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అలాగే పూనమ్ చనిపోయిందంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేసిందుకు ఆమె మేనేజర్ నికితా శర్మపై సైతం కేసు నమోదైంది. పూనమ్ పాండే సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో తాను అందరితో ఓ ముఖ్యమైన వియాన్ని పంచుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. తాను సజీవంగానే ఉన్నానని.. తనకు సర్వైకల్ క్యాన్సర్ లేదని పేర్కొంది. చాలా మంది గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని చెప్పింది. ఇతర క్యాన్సర్లలా కాకుండా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చని పేర్కొంది. ప్రతి మహిళ తీసుకోవాల్సిన చర్యల గురించి తెలుసుకోవాలని తద్వారా సర్వైకల్ క్యాన్సర్ వినాశకరమైన ప్రభావాన్ని అంతం చేయడానికి కలిసి ప్రయత్నిద్దామని పిలుపునిచ్చింది. అయితే, డెత్ స్టంట్‌పై సోషల్ మీడియాలో పూనప్‌పై పలువురు మండిపడుతున్నారు.
ఆమెపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు పలువురు నటికి మద్దతు తెలిపారు. ఇందులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం అండగా నిలిచారు. గర్భాశయ కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పూనం ఎంచుకున్న పద్ధతి పలువురికి అర్థం కాకపోవచ్చని.. ఆమె ప్రయత్నాన్ని ఎవరూ ప్రశ్నించేలేరంటూ పేర్కొన్నారు. పూనమ్ వల్లే ప్రస్తుతం గర్భాశయ కేన్సర్‌పై విస్తృతంగా చర్చ జరిగిందన్న ఆయన.. ఆమె చాలా ఏళ్లు ఆనందంగా బతకాలని తాను కోరుకుంటునన్నానని వర్మ ట్వీట్ చేశారు.