సీఎం కేసీఆర్, కూసుకుంట్లపై కేసు.. సోమవారానికి వాయిదా
విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో చండూర్ సభలో సీఎం కేసీఆర్ ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ నల్గొండ కోర్టులో పిటీషన్ దాఖలైనది. ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఏనుగు సత్తిరెడ్డి తరుపున లాయర్ పురుషోత్తం రెడ్డి జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి విచారణ చేపట్టి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సీఎం కేసీఆర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లపై ఎఫ్ఎస్. 450/2022 కింద నమోదైన కేసును విచారణకు […]

విధాత: మునుగోడు ఉప ఎన్నికల్లో చండూర్ సభలో సీఎం కేసీఆర్ ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ నల్గొండ కోర్టులో పిటీషన్ దాఖలైనది. ఎలక్ట్రికల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఏనుగు సత్తిరెడ్డి తరుపున లాయర్ పురుషోత్తం రెడ్డి జిల్లా స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై న్యాయమూర్తి విచారణ చేపట్టి తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సీఎం కేసీఆర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి లపై ఎఫ్ఎస్. 450/2022 కింద నమోదైన కేసును విచారణకు స్వీకరించారు.
15 రోజుల్లో చండూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని, 100 పడకల ఆసుపత్రి, రోడ్లను అద్దంలా మారుస్తామని ఎన్నికల చట్టాలకు విరుద్ధంగాఓటర్లకు సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి ప్రలోభ పెట్టారని న్యాయవాది పురుషోత్తం తెలిపారు.