సీఎం కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణ.. కేంద్ర హోంశాఖ ఆదేశం

సీఎం కేజ్రీవాల్‌పై సీబీఐ విచారణ.. కేంద్ర హోంశాఖ ఆదేశం

విధాత : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది. సీఎం నివాస నిర్మాణం ఆధునీకరణ పేరుతో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. మే నెలలోనే ఈ వివాదంపై ఎల్‌జీ విచారణ కోరుతూ సీబీఐ డైరక్టర్‌కు లేఖ రాశారు.


సీఎం కేజ్రీవాల్‌ తన నివాసం ఆధునీకరణకు గతంలో చెప్పినట్లుగా 45కోట్లు ఖర్చు చేయలేదని, 175కోట్లు ఖర్చు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని బీజేపీ ఆరోపిస్తుంది. కాగా కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించడంపై ఆద్మీ పార్టీ మండిపడుతుంది. తమ పార్టీని నాశనం చేసేందుకు అక్రమ కేసులు, విచారణలకు పాల్పడుతుందని ఆ పార్టీ నాయకులు కేంద్రంపై విమర్శల దాడి ఆరంభించారు.


ఇప్పటికే తమ సీఎణ కేజ్రీవాల్‌పై 50కిపైగా కేసులు నమోదు చేసి విచారించినా ఏలాంటి అక్రమాలు రుజువుకాలేదన్నారు. కేంద్రం దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో కేజ్రీవాల్‌పై దాడి చేసినా సామాన్యుడి ప్రయోజనాల కోసం ఆయన, ఆమ్‌ ఆద్మీ తమ పోరాటం కొనసాగిస్తుందన్నారు.