67 పోర్న్‌ వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం.. లిస్ట్‌ ఇదే!

విధాత,న్యూఢిల్లీ: పోర్న్‌ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఐటీ చట్టం-2021 నిబంధనల ఉల్లంఘన, కోర్టు ఆదేశాల మేరకు 67 అశ్లీల‌ వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేయాలని సంబంధిత ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతో పాటు పుణె కోర్టు ఆదేశాల మేరకు 63, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మరో 4 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. మార్ఫింగ్‌ చేసిన, మహిళల పూర్తి, పాక్షిక […]

  • By: krs    latest    Sep 30, 2022 5:09 AM IST
67 పోర్న్‌ వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేసిన కేంద్రం.. లిస్ట్‌ ఇదే!

విధాత,న్యూఢిల్లీ: పోర్న్‌ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఐటీ చట్టం-2021 నిబంధనల ఉల్లంఘన, కోర్టు ఆదేశాల మేరకు 67 అశ్లీల‌ వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేయాలని సంబంధిత ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతో పాటు పుణె కోర్టు ఆదేశాల మేరకు 63, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మరో 4 వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది.

మార్ఫింగ్‌ చేసిన, మహిళల పూర్తి, పాక్షిక నగ్న వీడియోలను వెంటనే తొలగించాలనీ, యాక్సెస్‌ డిసేబుల్డ్‌ గానీ చేయాలని ఆదేశించింది. అలాంటి వెబ్‌సైట్ల యూఆర్‌ఎల్‌లను బ్లాక్‌ చేయాలని పేర్కొంది.