Cabinet | జూలై 3న కేంద్ర క్యాబినెట్‌ భేటీ

Cabinet | విధాత‌: కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో జూలై 3వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం. జూలై మూడో వారంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాటితో ఎన్నికల వాతావరణం పూర్తిస్థాయిలో నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత కొద్ది రోజులుగా అమిత్‌షా, నడ్డా, బీఎల్‌ సంతోష్‌ తదితరులు సంస్థాగత మార్పులు, రాజకీయ […]

  • Publish Date - June 29, 2023 / 03:10 PM IST

Cabinet |

విధాత‌: కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో జూలై 3వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ సమావేశం జరుగుతుందని సమాచారం.

జూలై మూడో వారంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వాటితో ఎన్నికల వాతావరణం పూర్తిస్థాయిలో నెలకొంటుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే గత కొద్ది రోజులుగా అమిత్‌షా, నడ్డా, బీఎల్‌ సంతోష్‌ తదితరులు సంస్థాగత మార్పులు, రాజకీయ అంశాలపై వరుస సమావేశాలు నిర్వహించారని తెలుస్తున్నది. దాదాపు రెండేండ్ల కాలంలో మోదీ క్యాబినెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకోలేదు.

Latest News