Mamnoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • By: sr    latest    Feb 28, 2025 6:49 PM IST
Mamnoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్, విధాత‌: రాష్ట్రంలో మరో ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరంగల్ లో మామూనూరు ఎయిర్ పోర్టు (Mamnoor Airport) నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఎయిర్ పోర్టు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తవ్వగా మరో 253 ఎకరాలు సేకరించాల్సి ఉంది. కేంద్రం తాజా ఉత్తర్వులతో నిర్మాణ పనులు ముమ్మరం కానున్నాయి.

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న ఎయిర్ పోర్టుకు ఎట్టకేలకు అనుమతి రావడం ద్వారా వరంగల్ మరింత అభివృద్ధి చెందుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.