విధాత: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ మాజీ ఇంచార్జి చకిలం అనిల్ కుమార్ ఆరంభించిన ఉద్యమ కారుల ఆత్మగౌరవ పోరు ఒక్కో గ్రామాల వారిగా ఉదృతం చేస్తున్నారు. పార్టీలోని ఉద్యమకారులను, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వైఖరిపై అసంతృప్తి ఉన్న అసమ్మతి వాదులతో వరుస భేటీలు నిర్వహిస్తూ చాపకింద నీరులా వారందరిని సమీకరిస్తూ తన ఉద్యమ పోరుకు పదును పెడుతున్నారు. సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారులతో చకిలం భేటీ […]
విధాత: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ మాజీ ఇంచార్జి చకిలం అనిల్ కుమార్ ఆరంభించిన ఉద్యమ కారుల ఆత్మగౌరవ పోరు ఒక్కో గ్రామాల వారిగా ఉదృతం చేస్తున్నారు.
పార్టీలోని ఉద్యమకారులను, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వైఖరిపై అసంతృప్తి ఉన్న అసమ్మతి వాదులతో వరుస భేటీలు నిర్వహిస్తూ చాపకింద నీరులా వారందరిని సమీకరిస్తూ తన ఉద్యమ పోరుకు పదును పెడుతున్నారు.
సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారులతో చకిలం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యమ కారులు మాట్లాడుతూ స్వరాష్ట్రం కోసం ఉద్యమించిన వారికి, సీనియర్లకు పార్టీలో తగిన గుర్తింపు, పదవులు, ప్రభుత్వ పథకాలలో భాగస్వామ్యం దక్కడం లేదంటూ వాపోయారు.
చకిలం మాట్లాడుతూ పార్టీలో ఉద్యమ కారులకు జరుగుతున్న అన్యాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒత్తిడి లకు లొంగకుండా పోరాడాలని, అటువంటి వారంతా తనతో కలిసి నడువాలని కోరారు.