NTR | చంద్ర‌బాబు అరెస్ట్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి పెద్ద త‌ల‌నొప్పిగా మారిందే..!

NTR | స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నంద్యాల‌లో అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అరెస్ట్‌తో ఇప్పుడు ఏపీ గంద‌ర‌గోళంగా మారింది. తెలుగు త‌మ్ముళ్లు ర‌ణ‌రంగం సృష్టిస్తున్నారు. మ‌రి కొంద‌రు ప్ర‌ముఖులు చంద్ర‌బాబుకి మద్ద‌తు తెలియ‌జేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య, రామకృష్ణ బావ చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండించారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చంద్ర‌బాబు అరెస్ట్‌ని […]

  • By: sn    latest    Sep 11, 2023 2:31 PM IST
NTR | చంద్ర‌బాబు అరెస్ట్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి పెద్ద త‌ల‌నొప్పిగా మారిందే..!

NTR |

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నంద్యాల‌లో అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న అరెస్ట్‌తో ఇప్పుడు ఏపీ గంద‌ర‌గోళంగా మారింది. తెలుగు త‌మ్ముళ్లు ర‌ణ‌రంగం సృష్టిస్తున్నారు. మ‌రి కొంద‌రు ప్ర‌ముఖులు చంద్ర‌బాబుకి మద్ద‌తు తెలియ‌జేస్తున్నారు.

నందమూరి కుటుంబ సభ్యులు బాలయ్య, రామకృష్ణ బావ చంద్రబాబు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం చంద్ర‌బాబు అరెస్ట్‌ని ఖండించారు. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా చంద్ర‌బాబు అరెస్ట్‌ని త‌ప్పుప‌డుతూ విజయవాడలో చంద్రబాబుని కలిసి సంఘీభావం తెలిపే ప్రయత్నం చేశారు. కాని పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో కాస్త వెన‌క్కి త‌గ్గారు.

అయితే చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయి చాలా గంట‌లు అవుతున్నా కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ స్పందించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే త‌న ఫ్యామిలీ స‌భ్యుడైన చంద్ర‌బాబు అరెస్ట్ అయిన కూడా ఎన్టీఆర్ ఒక్క ప్ర‌క‌ట‌న కూడా చేయ‌క‌పోవ‌డం దారుణం అంటూ సోష‌ల్ మీడియాలో కొంద‌రు తెగ ట్రోల్ చేస్తున్నారు.

నంద‌మూరి ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి ఎన్టీఆర్ కాదు. అవసరం తీరాక ఎదుగుదలకు కారణమైన వాళ్ళను వదిలేశాడని ఆయ‌న‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. చంద్ర‌బాబుకి సంఘీభావం తెల‌పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి ఇంత ప్రెజ‌ర్‌లో జూనియ‌ర్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.

జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా టీడీపీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ఆయ‌న‌కి లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి క్యారెక్టర్ పై వైసీపీ నేతలు తప్పుడు కామెంట్స్ చేసిన‌ప్పుడు ఎన్టీఆర్ స్పందించిన తీరు తెలుగు త‌మ్ముళ్ల‌కి ఆగ్ర‌హం తెప్పించింది.

కొద్ది రోజుల క్రితం హైద‌రాబాద్‌లో జరిగిన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల్లో రామ్ చ‌ర‌ణ్ పాల్గొన్న‌, జూనియర్ పాల్గొనక పోవడం కూడా ఆయన మీద మ‌రింత వ్య‌తిరేఖ‌త పెంచింది. కాగా, కొన్నాళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి చంద్రబాబు తీవ్ర‌మైన‌ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

చంద్ర‌బాబు, లోకేష్ సభల్లో జై ఎన్టీఆర్ నినాదాలు టీడీపీ నాయ‌కుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌ర పెడుతున్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్ ని టీడీపీ పార్టీకి దూరం చేసేలా, కేడర్ లో ఆయనను తప్పుగా చిత్రీకరించేలా బాబు ప్రణాళికలు వేస్తున్నారని అని రాజకీయ విశ్లేషకుల వాదన.