ప్రచారం స్టైల్ మార్చిన చంద్రబాబు.. సడన్‌గా టీ కొట్లో ప్రత్యక్షం!
జనంతో ముచ్చట్లు విధాత: గతంలో ఎన్నడూ లేనిది ఈసారి చంద్రబాబు ఎన్నికల ప్రచార స్టయిల్ మార్చినట్లున్నారు. సాధారణంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడి నేరుగా హోటల్ లేదా గెస్ట్ హౌస్ కు వెళ్లిపోతారు తప్ప దారిలో పెద్దగా ఆగరు. కానీ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ సలహాలో.. ఇంకేదో.. ఏమో గానీ ఇప్పుడు కొత్త తీరులో వెళుతున్నారు. జోష్‌లో తెలుగు తమ్ముళ్లు.. బాబులో వచ్చిన ఈ మార్పు బాగుందే అని కార్యకర్తలు ఖుషి అవుతున్నారు. టీడీపీ […]

- జనంతో ముచ్చట్లు
విధాత: గతంలో ఎన్నడూ లేనిది ఈసారి చంద్రబాబు ఎన్నికల ప్రచార స్టయిల్ మార్చినట్లున్నారు. సాధారణంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడి నేరుగా హోటల్ లేదా గెస్ట్ హౌస్ కు వెళ్లిపోతారు తప్ప దారిలో పెద్దగా ఆగరు. కానీ ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ సలహాలో.. ఇంకేదో.. ఏమో గానీ ఇప్పుడు కొత్త తీరులో వెళుతున్నారు.
జోష్‌లో తెలుగు తమ్ముళ్లు..
బాబులో వచ్చిన ఈ మార్పు బాగుందే అని కార్యకర్తలు ఖుషి అవుతున్నారు. టీడీపీ చేపడుతున్నఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. చంద్రబాబు సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో తెలుగు తమ్ముళ్లు కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు.
సామాన్యుడి మాదిరిగా…
శనివారం బాపట్లలో చంద్రబాబు తన పర్యటన రూటు మార్చారు. అక్కడ అప్పికట్లలో రోడ్డుపక్కన ఉన్న ఒక టీ కొట్టుకు వెళ్లి ఆయన సామాన్యుడి మాదిరిగా టీ తాగుతూ అక్కడి సామాన్య జనంతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. దీనివల్ల తమకు ప్రజల్లో మద్దతు పెరుగుతుందని కార్యకర్తలు అంటున్నారు.
రాబిన్ శర్మ సలహా ప్రకారమే..
మున్ముందు చంద్రబాబు ఇలాంటివే మరికొన్ని సడన్ మెరుపులు మెరిపిస్తారని, ఇవన్నీ రాబిన్ శర్మ సలహాలని అంటున్నారు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ జగన్ కు సలహాదారుగా ఉన్నారు. ఆయన సలహాలు, సూచనలు జగన్ పాటిస్తారని , ఆ బాటలోనే జగన్ 2019లో గెలిచారని అంటారు.
అయితే ప్రశాంత్ కిషోర్ ఓ నేరగాడని, మాయలోడని గతంలో చంద్రబాబు ఆరోపించారు. అయితే అనూహ్యంగా ఆ ప్రశాంత్ కిషోర్ శిష్యుడు రాబిన్ శర్మను చంద్రబాబు తమ టీడీపీ కోసం వ్యూహకర్తగా పెట్టుకున్నారు. ఆయన సూచనలు, సలహాల మేరకే ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ వంటి కార్యక్రమాలు రాబిన్ శర్మ రూపొందించినవే అని అంటున్నారు.