151 మందిని మార్చినా జగన్ మళ్లీ గెలవడు : చంద్రబాబు
సీఎం జగన్ 11 మంది వైసీపీ ఇంచార్జులను మార్చడమే కాదు..మొత్తం 151మందిని మార్చినా సీఎం జగన్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు

విధాత : సీఎం జగన్ 11 మంది వైసీపీ ఇంచార్జులను మార్చడమే కాదు..మొత్తం 151మందిని మార్చినా సీఎం జగన్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని మాజీ సీఎం, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాడేపల్లి ప్యాలెస్‌ల ఓటమి భయం పట్టుకుందని, అందుకే 11 మంది ఇంచార్జులను మార్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఒక నియోజకవర్గంలో చెల్లని కాసులు.. మరో చోట చెల్లుతాయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను, ఇంచార్జీలను ట్రాన్స్‌ఫర్‌లు చేస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు విసరిరారు. తన పాలనపై తిరుగుబాటు మొదలుకావడంతో సీఎం జగన్ మార్పులకు తెరతీశారని, చంద్రబాబు ఆరోపించారు ప్రజలను వైసీపీ ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ప్రజా వ్యతిరేకత నేపధ్యంలోనే దళిత నేతలను బదిలీ చేశారని వ్యాఖ్యానించారు.
బీసీలపై ప్రేమ ఉందని చెప్పుకునే వైసీపీ నాయకులు పులివెందుల సీటును వారికి ఇవ్వమని సీఎం జగన్ ను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ సన్నద్ధమవుతోందని, అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించిందన్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేనతో పొత్తులో ఉన్నామని, సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని స్పష్టత ఇచ్చారు.
ఈసారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోందని చెప్పారు. వైసీపీలోని అసంతృప్తులు తమకెందుకనన్నారు. అక్కడ టిక్కెట్ రాలేదని తమ దగ్గరకు వస్తామంటే తమకు అవసరం లేదన్నారు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామన్నారు. బలా బలాలను బట్టే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కుప్పంలోనూ ప్రజాభిప్రాయం సేకరిస్తామని చెప్పారు.
తుఫాన్‌లను ఆపలేకపోయిన వాటి ద్వారా వచ్చే నష్టాన్ని నివారించవచ్చని, ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. 15జిల్లాల్లో 22లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయాయని, ప్రభుత్వం పంట నష్టంపై నివేదికలు సిద్ధం చేయలేదని, తుఫాన్ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించాలని తాను కేంద్రానికి లేఖ రాసానన్నారు. తుఫాన్‌తో 3,711కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వాహణ అద్వాన్నంగా మారిందని, పులిచింతల గేట్లు కొట్టుకపోయిన పట్ట్టించుకోలేదని, గుండ్ల కమ్మ గేట్లను ప్రభుత్వం మరమ్మతు చేయలేకపోయిందని, ప్రభుత్వంపై నమ్మకం లేక కాంట్రాక్టర్లు ఎవరు అందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. ద్యపాన నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగన్‌కు ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉండేవాళ్లు ఈ రాష్ట్రంలో ఓటు వేయొద్దని ఎలా చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారని నిలదీశారు. జగన్ చేసేవన్నీ చెత్త పనులే అని మండిపడ్డారు. రుషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా అని అని నిలదీశారు. రుషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా అని ప్రశ్నించారు. చట్టం సీఎంకు వర్తించదా అని నిలదీశారు. జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదన్నారు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తున్నారు.. తరలింపు సాధ్యమా..? ఎలా తరలిస్తారని అడిగారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని చంద్రబాబు హెచ్చరించారు.