Chandrababu Naidu | CID కస్టడీకి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు తీర్పు!

Chandrababu Naidu | స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. ఐదురోజుల పాటు సీఐడీ కస్టడీకి కోరగా.. రెండురోజుల కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, రాజమండ్రి జైలులోనే చంద్రబాబును విచారించాలని కోర్టు సీఐడీకి సూచించింది. భద్రతా కారణాలతోనే జైలులోనే విచారించాలని ఆదేశించినట్లు సమాచారం.
అయితే, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌లో రాజమండి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే, ఆయనను ఐదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో గత బుధవారం రోజునే సీఐడీతో పాటు, చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మూడురోజులుగా తీర్పు వాయిదా పడుతూ వచ్చింది.
గురువారం శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును ఇవ్వనున్నట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గురువారం తెలిపారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ నేపథ్యంలో తీర్పును వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును బట్టి ఆదేశాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు తీర్పును తాజాగా వెలువరించింది.
గత కొద్దిరోజులుగా సీఐడీ కస్టడీ తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు సీఐడీ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు బాబును రెండురోజుల కస్టడీకి ఇచ్చింది. అయితే, ఇవాళ ఉదయం జ్యుడీషియల్ కస్టడీని రెండురోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండురోజులే కస్టడీకి ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇక చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.