జగన్కు పోటీగా చంద్రబాబు కొత్త ప్లాన్.. సాధికార సారథుల నియామకం!
విధాత: చంద్రబాబు అన్నీ గమనిస్తున్నారు. జగన్ వేసే ఎత్తులు, జిత్తులు చూస్తున్నారు. ఆయన ఏరూట్లో వస్తున్నారో చూసుకుని సరిగ్గా దానికి ఎదురెళ్లి ఎటాక్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సారథులకు పోటీగా సాధికార సారథులు అనే పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ ద్వారా ఓట్లను సమీకరించి అధికార పీఠానికి చేరుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి జగన్ ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు గ్రామ సారథులను నియమిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ 175కి […]

విధాత: చంద్రబాబు అన్నీ గమనిస్తున్నారు. జగన్ వేసే ఎత్తులు, జిత్తులు చూస్తున్నారు. ఆయన ఏరూట్లో వస్తున్నారో చూసుకుని సరిగ్గా దానికి ఎదురెళ్లి ఎటాక్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సారథులకు పోటీగా సాధికార సారథులు అనే పేరిట కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.
వాళ్ళ ద్వారా ఓట్లను సమీకరించి అధికార పీఠానికి చేరుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి జగన్ ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు గ్రామ సారథులను నియమిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ 175కి 175 సీట్లు సాధించాలని టార్గెట్గా పెట్టుకుని ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారథులను నియమించారు
మొత్తం 2000 జనాభాకు ఓ కన్వీనర్ ఉంటారు. వీళ్లంతా ప్రతి ఇంటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తారు. ఈమేరకు వైసీపీ మొత్తం 5.65 లక్షల మంది గృహ సారథులు సచివాలయ కన్వీనర్లను నియమిస్తున్నారు.
వీరంతా రాస్ట్రంలోని 1.65 కోట్ల కుటుంబాలను టచ్ చేస్తారు. సరిగ్గా ఇదే తరహాలో టీడీపీ సైతం కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జగన్ 50 ఇళ్లకు ఇద్దర్ని పెడితే చంద్రబాబు ప్రతి 30 ఇళ్ళకు ఒకర్ని నియమిస్తున్నారు.
ఈమేరకు ఆయన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు విషయం చెప్పారు. ప్రతి 30 కుటుంబాలకు సాధికార సారథులను నియమిస్తామని వెల్లడించారు.
ఇకపై పార్టీలో ఉన్న సెక్షన్ ఇన్ఛార్జ్లందరినీ కుటుంబ సాధికార సారథులుగా పిలుస్తామన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించేలా వీళ్లు పనిచేస్తారని వివరించారు. సాధికార సారథులుగా మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. మొత్తానికి గ్రామాల్లో గృహసారధులు.. సాధికార సారథులు హాల్ చల్ చేస్తారన్నమాట.